`ఎవరు మీలో కోటీశ్వరులు` ప్రోమో వచ్చేసింది. దీనికి హోస్ట్ ఎవరో తెలిసిపోయింది. ఎన్టీఆర్‌ హోస్ట్ గా అధికారిక ప్రకటన వచ్చేసింది. శనివారం ఈ విషయాన్ని వెల్లడించారు. ఎన్టీఆర్‌ ట్వీట్‌ చేశారు. ఈ సందర్భంగా `ఎవరు మీలో కోటీశ్వరులు` ప్రోమో విడుదల చేశారు. ఇందులో ఆయన కొమురంభీమ్‌ గెటప్‌లో కనిపించడం విశేషం. తాజాగా విడుదలైన ప్రోమో ట్రెండ్‌ అవుతుంది. 

జెమినీ టీవీలో ఈ షో ప్రసారం కానుంది. గతంలో మాటీవీలో ప్రసారమైన విషయం తెలిసిందే. ప్రస్తుతం నాల్గో సీజన్‌ రాబోతుంది. గతంలో నాగార్జున, చిరంజీవి హోస్ట్ లు చేయగా, ఇప్పుడు ఎన్టీఆర్‌ హోస్ట్ చేస్తున్నారు. ఇక తాజాగా విడుదలైన ప్రోమోలో ఎన్టీఆర్‌ `ఎవరు మీలో కోటీశ్వరులు` గురించి వివరించారు. `ఇక్కడ కథ మీది, కల మీది.. ఆట నాది.. కోటీ మీది.. రండి గెలుద్దాం` అంటూ చెప్పే డైలాగ్‌లు ఆకట్టుకుంటున్నాయి. చివరగా `మీ రామారావు. ఎందరో మహానుభావులు అందరికి వందనాలు` అని ఫినిషింగ్‌ టచ్‌ ఇవ్వడం హైలైట్‌గా నిలిచింది. ఇది త్వరలోనే ప్రారంభం కానుందట.