Asianet News TeluguAsianet News Telugu

ఎన్టీఆర్‌ హోస్ట్ `ఎవరు మీలో కోటీశ్వరులు` డేట్‌ ఫిక్స్.. మెగాస్టార్‌ బర్త్ డే టార్గెట్‌

ఈ రియాలిటీ షో ప్రారంభం కానుందని తాజాగా మరో ప్రోమోని విడుదల చేశారు. `వస్తున్న.. మీ ఇంటికి వచ్చేస్తున్నా.. ప్రతి సోమవారం నుంచి గురువారం వరకు రాత్రి 8.30గంటలకు `ఎవరు మీలో కోటీశ్వరులు`` అంటూ ఎన్టీఆర్‌ క్లారిటీ ఇచ్చారు. 

ntr host evaru meelo koteeswarulu august 22nd onwards its megastar birthday
Author
Hyderabad, First Published Aug 14, 2021, 2:23 PM IST
  • Facebook
  • Twitter
  • Whatsapp

ఎన్టీఆర్‌ మరోసారి హోస్ట్ చేస్తున్న షో `ఎవరు మీలో కోటీశ్వరులు`. జెమినీ టీవీలో ఇది ప్రసారం కానుంది. గత నాలుగైదు నెలలుగా ఎప్పుడెప్పుడూ అంటూ ఊరిస్తుందీ షో. నిత్యం ప్రోమోలతో సందడి చేస్తున్నారు. `కమ్మింగ్‌ సూన్‌` అంటూ ప్రోమోలతోనే సరిపెడుతున్నారు. ఇంకా షో ఎప్పుడు స్టార్ట్ అవుతుందంటూ నెటిజన్లు, ఎన్టీఆర్‌ అభిమానులు ట్రోల్స్, మీమ్స్ తో ట్రెండ్‌ చేస్తూ వస్తున్నారు. ఎట్టకేలకు నిర్వహకులు షో టెలికాస్ట్ డేట్‌ని ఫిక్స్ చేశారు. అందుకు మెగాస్టార్‌ చిరంజీవి బర్త్ డేని వేదికగా చేసుకోవడం విశేషం. 

అంటే ఈ నెల 22(ఆగస్ట్) నుంచి ఈ రియాలిటీ షో ప్రారంభం కానుందని తాజాగా మరో ప్రోమోని విడుదల చేశారు. `వస్తున్న.. మీ ఇంటికి వచ్చేస్తున్నా.. ప్రతి సోమవారం నుంచి గురువారం వరకు రాత్రి 8.30గంటలకు `ఎవరు మీలో కోటీశ్వరులు`` అంటూ ఎన్టీఆర్‌ క్లారిటీ ఇచ్చారు. ఇన్నాళ్ల నిరీక్షణకు తెరదించారు. దీంతో ఎన్టీఆర్‌ అభిమానులు కాస్త ఊరిపి పీల్చుకున్నారు. తమ అభిమాన హీరోని టీవీలో రోజూ చూసుకునే అవకాశం దక్కుతున్నందుకు ఖుషీ అవుతున్నారు. 

ఎన్టీఆర్‌ తెరపై కనిపించి మూడేళ్లవుతుంది. చివరగా ఆయన `అరవింద సమేత వీర రాఘవ` చిత్రంతో కనిపించారు. ఆ తర్వాత `ఆర్‌ఆర్‌ఆర్‌`లో బిజీ అయ్యారు. ఈ సినిమా పూర్తి కావడానికి మూడేళ్లు పట్టింది. దీంతో ఎన్టీఆర్‌ ని కనీసం బుల్లితెరపైనా చూసుకుందామని ఆయన అభిమానులు వెయిట్‌ చేస్తున్నారు. కానీ కరోనా కారణంగా `ఎవరు మీలో కోటీశ్వరులు` షో వాయిదా పడుతూ వస్తోంది. ఇప్పుడు ఎట్టకేలకు షోని ప్రారంభించేందుకు ముహుర్తం ఫిక్స్ చేసుకున్నారు. ఆగస్ట్ 22 మెగాస్టార్‌ చిరంజీవి బర్త్ డే కావడం విశేషం. అయితే గత సీజన్‌కి(నాల్గో సీజన్‌)కి చిరంజీవి ఈ షోకి హోస్ట్ చేసిన విషయం తెలిసిందే. మొదటి మూడు సీజన్స్ కి నాగార్జున హోస్ట్ గా చేశారు.

Follow Us:
Download App:
  • android
  • ios