ఎన్టీఆర్ వంటి స్టార్ హీరో,అంతకు మించి నటుడుతో ఎవరికి చేయాలని ఉండదు చెప్పండి. అయితే అందరికీ ఆ అదృష్టం దక్కదు. తమను తాము ప్రూవ్ చేసుకున్న దర్శకులకు ఈజీగా ఏక్సెస్ దొరుకుతుంది. అందులోనూ ఎన్టీఆర్ ప్రస్తుతం ప్రతీ ప్రాజెక్టు ఎంతవరకూ తన కెరీర్ కు ఉపయోగపడుతుందనే విషయం ఆచి,తూచి ఆలోచించి డెసిషన్ తీసుకుంటున్నారు. ఆ క్రమంలోనే రీసెంట్ గా ఓ కథని ఆయన విన్నట్లు తెలుస్తోంది.

ఎన్టీఆర్ తాజా చిత్రంగా రాజమౌళి దర్శకత్వంలో రూపొందుతోన్న 'ఆర్ ఆర్ ఆర్' రెడీ అవుతోంది. ఎన్టీఆర్ ఫ్యాన్స్  పూర్తి దృష్టి ఈ సినిమాపైనే ఉంంది. ఈ సినిమా తరువాత త్రివిక్రమ్ దర్శకత్వంలో ఎన్టీఆర్ చేయటానికి సిద్దమవుతున్నాడు. అందుకు సంబంధించిన స్క్రిప్ట్ పైనే త్రివిక్రమ్ కసరత్తు చేస్తున్నట్లు వార్తలు వస్తున్నాయి. మరి  ఆ తరువాత ప్రాజెక్టు ఎవరితో చేస్తారు అంటే... తరుణ్ భాస్కర్ తో ఉండొచ్చనే టాక్ వినిపిస్తోంది.

రీసెంట్ గా ఓ ఇంటర్వ్యూలో తరుణ్ భాస్కర్ మాట్లాడుతూ, ఆల్రెడీ ఎన్టీఆర్ కి ఒక కథను వినిపించినట్టుగా చెప్పాడు. ఎన్టీఆర్ నుంచి గ్రీన్ సిగ్నల్ రావలసి వుంది. తరుణ్ భాస్కర్ డిఫరెంట్ స్టోరీ లైన్ లకు ఎక్కువగా ప్రాధాన్యతనిస్తాడు. ఆయన టేకింగ్,మేకింగ్ డిఫరెంట్ గా ఉంటుంది. తనదైన స్టైల్లో ఎన్టీఆర్ ను చూపించడానికి ఆయన ఇంట్రస్ట్ ని చూపుతున్నాడు. 

అయితే అదే సమయంలో  ఎన్టీఆర్ స్టార్ ఇమేజ్ కు తగ్గ అవుతుందా లేదా అన్నది ఫ్యాన్స్ సందేహం. ఎన్టీఆర్ కూడా అదే ఆలోచనలో ఉన్నారట. ఆయన  ఓకే అంటే ఈ సినిమా సెట్స్ పైకి వెళుతుంది.యస్ అని ఆయన నోటి నుంచి వచ్చే క్షణం కోసమే తరుణ్ భాస్కర్ ఎదురుచూస్తున్నాడు. ఎన్టీఆర్ ఏ డెసిషన్ తీసుకుంటారో చూడాలి మరి.