శంకర్‌పల్లిలో ఎన్టీఆర్ ఫార్మ్ హౌస్ ప్లాన్ వెనక అసలు కారణం ఇదే
రంగారెడ్డి జిల్లా గోపాలపురం గ్రామంలోని రెవెన్యూ పరిధిలో ఆయన ఆరున్నర ఎకరాల భూమి కొనుగోలు చేశారు. అందుకు సంబంధించిన రిజిస్ట్రేషన్ పనుల కోసమే ఎమ్మార్వో ఆఫీస్‌కి వెళ్లారు.
తెలుగులో నెంబర్ వన్ స్దానంలో ఉన్న స్టార్స్ లో ఎన్టీఆర్ ఒకరు. అలాగే హైయిస్ట్ పెయిడ్ ఆర్టిస్ట్ లలో కూడా ఒకరు. ఆయన తన సంపాదనని తెలివైన పెట్టుబడిలుగా మార్చాలనుకుంటన్నారు. అందుకోసం ఆయన రీసెంట్ గా శంకర్ పల్లిలో లాండ్ సైతం కొనుగోలు చేసారు. ఇప్పుడు ఆ భూమిలో ఆర్గానిక్ ఫార్మింగ్ చేయబోతున్నట్లు సమాచారం.
వివరాల్లోకి వెళితే... రంగారెడ్డి జిల్లా గోపాలపురం గ్రామంలోని రెవెన్యూ పరిధిలో ఆయన ఆరున్నర ఎకరాల భూమి కొనుగోలు చేశారు. అందుకు సంబంధించిన రిజిస్ట్రేషన్ పనుల కోసమే ఎమ్మార్వో ఆఫీస్‌కి వెళ్లారు. వైరల్ అయ్యిన ఆ ఫొటోలు అందరం చూసాం. రిజిస్ట్రేషన్ ఫార్మాలిటీస్ పూర్తి చేసుకున్న ఆయన ఆ భూమిలో లావిష్ ఫార్మ్ హౌస్ నిర్మించబోతున్నారు. అలాగే అక్కడ ఆర్గానిక్ ఫార్మింగ్ చేయబోతున్నారు. అందుకోసమే గత కొంతకాలంగా ఆయన కుటుంబం మంచి స్దలం కోసం అన్వేషించి అక్కడ ఫైనలైజ్ చేసారు.
అక్కడ లొకేషన్, వాతావరణం చూసిన ఎన్టీఆర్ వెంటనే ఎంత రేటు అయినా పెట్టి కొనాలని ఫిక్స్ అయ్యారు. అక్కడ తన వర్క్ లో రిలాక్సేషన్ కోసం ఖాళీ సమయాలను అక్కడ ఇక నుంచి గడుపుతారు. మరోప్రక్క ఆర్గానిక్ ఫార్మింగ్ జరుగుతుంది. అప్పుడప్పుడూ ఆయనా ఆ పనుల్లో పాల్గొంటారు. ఈ ఆలోచనతోనే ఆయన ఆ భూమిని కొనుగోలు చేసినట్లు సమాచారం.
ఇక సినిమాల విషయానికి వస్తే ప్రస్తుతం ఎన్టీఆర్ ‘ఆర్‌ఆర్‌ఆర్’లో నటిస్తున్నారు. రాజమౌళి తెరకెక్కిస్తోన్న ఈ సినిమాలో తారక్ కొమురంభీమ్‌గా కనిపించనున్నారు. ఈ సినిమా పూర్తైన వెంటనే ఆయన కొరటాల శివతో ప్రాజెక్ట్ పట్టాలెక్కించే అవకాశమున్నట్లు సమాచారం. మరోవైపు, ‘అరవింద సమేత’ తర్వాత తారక్-త్రివిక్రమ్ కాంబోలో మరో సినిమా ఓకే అయిన విషయం తెలిసిందే.