Asianet News TeluguAsianet News Telugu

`ఆర్‌ఆర్‌ఆర్‌`కి ఆస్కార్‌ తర్వాత ఎన్టీఆర్‌ ఫస్ట్ స్పీచ్‌.. ఆ క్షణాలు మర్చిపోలేని అనుభూతి అంటూ ఎమోషనల్‌..

ఆస్కార్‌ వచ్చిన అనంతరం ఎన్టీఆర్‌ ఫస్ట్ టైమ్‌ బహిరంగ ఈవెంట్లో పాల్గొన్నారు. ఆయన విశ్వక్‌ సేన్‌ హీరోగా నటించిన `ధమ్కీ` చిత్ర ప్రీ రిలీజ్‌ ఈవెంట్‌కి గెస్ట్ గా హాజరయ్యారు. శుక్రవారం సాయంత్రం శిల్పకళావేదికలో జరిగిన ఈ ఈవెంట్‌లో ఎన్టీఆర్‌ మాట్లాడుతూ, ఆడియెన్స్ కి, ఇండియన్‌ సినిమాకి, ముఖ్యంగా తెలుగు చిత్ర సీమకి ధన్యవాదాలు తెలిపారు.

ntr first speech after rrr won oscar he emotional remembering oscar moments
Author
First Published Mar 17, 2023, 10:07 PM IST

ఎన్టీఆర్‌, రామ్‌చరణ్‌ కలిసి నటించిన `ఆర్‌ఆర్‌ఆర్‌` చిత్రానికి ఆస్కార్‌ వరించిన విషయం తెలిసిందే. రాజమౌళి రూపొందించిన ఈ చిత్రానికి `నాటు నాటు` పాటకిగానూ ఆస్కార్‌ వరించింది. ఇండియా గర్వించేలా చేసింది. ఈ సినిమా తరఫున సంగీత దర్శకుడు కీరవాణి, చంద్రబోస్‌ అవార్డులను అందుకున్నారు. అవార్డు పొందిన రెండో రోజు హైదరాబాద్‌కి చేరుకున్నారు ఎన్టీఆర్‌. మొదటగా ఆయనే ఇండియాకి వచ్చారు. ఎయిర్ పోర్ట్ లో ఘన స్వాగతం దక్కింది. 

ఆస్కార్‌ వచ్చిన అనంతరం ఎన్టీఆర్‌ ఫస్ట్ టైమ్‌ బహిరంగ ఈవెంట్లో పాల్గొన్నారు. ఆయన విశ్వక్‌ సేన్‌ హీరోగా నటించిన `ధమ్కీ` చిత్ర ప్రీ రిలీజ్‌ ఈవెంట్‌కి గెస్ట్ గా హాజరయ్యారు. శుక్రవారం సాయంత్రం శిల్పకళావేదికలో జరిగిన ఈ ఈవెంట్‌లో ఎన్టీఆర్‌ మాట్లాడుతూ, ఆడియెన్స్ కి, ఇండియన్‌ సినిమాకి, ముఖ్యంగా తెలుగు చిత్ర సీమకి ధన్యవాదాలు తెలిపారు. ఇది భారతీయ ప్రేక్షకదేవుళ్ళు సాధించిన ఘనతగా వర్ణించారు. అందరి ప్రేమ, ఆదరణ వల్లే ఈ అవార్డు వచ్చిందన్నారు తారక్‌. ఆస్కార్‌ అందించే క్షణాలను చూసేందుకు రెండు కళ్లు చాలలేదని, ఎప్పటికీ మర్చిపోలేని అనుభూతి అని వెల్లడించారు. 

ఎన్టీఆర్‌ మాట్లాడుతూ, `ఆర్‌ఆర్‌ఆర్‌` మూవీ ప్రపంచ పటంలో నిలబడిందంటే, ఆస్కార్‌ని సాధించిందంటే, అందుకు మా జక్కన్న రాజమౌళి ఎంత కారణమో, కీరవాణి ఎంత కారకులో, చంద్రబోస్‌ ఎంత కారకులో, పాట పాడిన రాహుల్‌, కాలభైరవ ఎంత కారకులో, డాన్సు కంపోజ్‌ చేసి ప్రేమ్‌ రక్షిత్‌ మాస్టర్‌ ఎంత కారణమో, వీరందరితోపాటు యావత్‌ తెలుగు చలనచిత్ర సీమ, భారతీయ చిత్ర సీమ కూడా అంతే కారణం. యావత్‌ భారతదేశ ప్రేక్షక దేవుళ్లు కూడా అంతే కారణం. వారింతోపాటు మీ అభిమానం ముఖ్యమైన కారణం` అన్నారు తారక్‌. 

ఆయన ఇంకా చెబుతూ, `ఆస్కార్‌ అవార్డు సాధించింది, ఆ సినిమాకి పనిచేసిన మేము కాదు, మాతోపాటు మీరు సాధించారు. మీ అందరి బదులు మేం అక్కడ నిల్చున్నాం. మా బదులు కీరవాణి, చంద్రబోస్‌ స్టేజ్‌పై నిల్చున్నారు, అవార్డు అందుకున్నారు. స్టేజ్‌పై కీరవాణి, చంద్రబోస్‌ ని చూస్తుంటే, వాళ్లు కనిపించలేదు, ఇద్దరు భారతీయులు కనిపించారు. ముఖ్యంగా ఇద్దరు తెలుగు వాళ్లు కనిపించారు. ఆ సమయంలో ఆ స్టేజ్‌ మొత్తం తెలుగుదనం ఉట్టిపడింది. టీవీలో చూసి మీరు ఎంత ఉత్సాహ పడ్డారో తెలియదుగానీ, ఆ స్టేజ్‌ని రెండు కళ్లతో చూడటం ఎప్పటికీ మర్చిపోలేని అనుభూతి. అది మున్ముందు వస్తుందో రాదో తెలియదు, రావాలని కోరుకుంటున్నా. కానీ ఆ మూమెంట్‌ ఎప్పటికీ గుర్తిండిపోతుంది. `ఆర్‌ఆర్‌ఆర్‌` ఇచ్చిన ఉత్సాహంతో తెలుగు సినిమాలు, భారత సినిమాలు ఇంకా మున్ముందుకు సాగాలని కోరుకుంటున్నా` అని చెప్పారు ఎన్టీఆర్‌. 

Follow Us:
Download App:
  • android
  • ios