యంగ్ హీరో వైష్ణవ్ తేజ్ హీరోగా తెరకెక్కిన లవ్ అండ్ ఎమోషనల్ ఎంటర్టైనర్ ఉప్పెన . వైష్ణవ్ డెబ్యూ మూవీగా విడుదల అవుతున్న ఈ చిత్రంపై పరిశ్రమలో పాజిటివ్ బజ్ ఉంది. చిత్ర టీజర్ మరియు సాంగ్స్ యూత్ కి విపరీతంగా నచ్చేశాయి. హీరోయిన్ కృతి శెట్టి సైతం తన క్యూట్ ఎక్స్ ప్రెషన్స్ తో ఆకట్టుకున్నారు. ఇక విలక్షణ నటుడు విజయ్ సేతుపతి కీలక రోల్ చేయడం సినిమాకు మరింత ప్రచారం తెచ్చి పెట్టింది.

 కాగా నేడు సాయంత్రం 4:05 నిముషాలకు ఉప్పెన ట్రైలర్ విడుదల కానుంది. యంగ్ టైగర్ ఎన్టీఆర్ ఉప్పెన ట్రైలర్ లాంచ్ చేస్తున్నారు. ఈ నేపథ్యంలో ఎన్టీఆర్ ఫ్యాన్స్ సోషల్ మీడియా లో సందడి చేస్తున్నారు . ఉప్పెన మూవీ ట్రైలర్ అప్డేట్ ని వారు భారీగా ట్రెండ్ చేస్తున్నారు. అలాగే ఉప్పెన ట్రైలర్ లో ఎన్టీఆర్ వాయిస్ ఓవర్ కూడా ఉందంటూ, ప్రచారం సాగుతుంది. దీనితో ఎన్టీఆర్ ఫ్యాన్స్ మరింతగా సంబరాలు చేసుకుంటున్నారు.

ఎన్టీఆర్ నుండి మూవీ వచ్చి రెండేళ్లు దాటిపోయింది. 2018లో విడుదలైన అరవింద సమేత తరువాత మరో మూవీ ఎన్టీఆర్ విడుదల చేయలేదు. దీనితో ఎన్టీఆర్ నుండి వస్తున్న ప్రతి అప్డేట్ ని వారు సెలెబ్రేట్ చేసుకుంటున్నారు. ప్రస్తుతం ఎన్టీఆర్ ఆర్ ఆర్ ఆర్ షూటింగ్ లో పాల్గొంటున్నారు . ఆర్ ఆర్ ఆర్ క్లెయిమాక్స్ కి సంబందించిన కొన్ని కీలక సన్నివేశాల చిత్రీకరణ జరుగుతుందని సమాచారం.