Asianet News TeluguAsianet News Telugu

#NTR:ఆ టీవీ ఛానెల్స్ బ్యాన్ చెయ్యమంటూ ఎన్టీఆర్ ఫ్యాన్స్ ట్రెండ్

జూనియర్ ఎన్టీఆర్ అభిమానులు టీవీ ఛానెల్‌ల పై  హ్యాష్‌ట్యాగ్‌తో ఎదురుదాడి మొదలెట్టారు. ఈ వివాదం అటు తిరిగి ఇటు తిరిగి తమ వైపు టర్న్ అవటం ఈ ఛానెల్స్ కు షాక్ ఇస్తున్నాయి. 

NTR fans trending to boycott ABN, Mahaa and TV5 channels
Author
First Published Sep 26, 2022, 3:56 PM IST


ఎన్టీఆర్ యూనివర్సీటి పేరు మార్పుపై జూనియర్ ఎన్టీఆర్ గురువారం ట్విటర్‌ ద్వారా స్పందించిన విషయం తెలిసిందే.అయితే ఈ ట్విట్‌పై  తెలగుదేశం అభిమానులను మండిపడుతున్నారు.ఆ ట్విట్‌లో ఎన్టీఆర్‌తో సమానంగా వైఎస్ఆర్‌ను పోగడడంపై జూనియర్ ఎన్టీఆర్‌పై తెలుగుదేశం కార్యకర్తలు విరుచుకుపడుతున్నారు.ఈ విషయమై సోషల్ మీడియాలో పెద్ద డిస్కషన్ జరుగుతోంది. అలాగే మీడియాలోనూ డిస్కషన్ మొదలైంది.

ఈ నేపధ్యంలో మన టీవి ఛానెల్స్ ...ABN, Mahaa News మరియు TV5 వంటి న్యూస్ ఛానెల్‌లు ఈ అంశంపై ప్రత్యేక కార్యక్రమాలను నిర్వహించాయి. అలాగే  సరైన ప్రకటన చేయలేదంటూ జూనియర్ ఎన్టీఆర్‌ను లక్ష్యంగా చేసుకుని మాటలు బాణాలు విసరటం మొదలెట్టాయి. ఈ పోగ్రామ్ లు  జూనియర్ ఎన్టీఆర్‌ని ప్రధాన లక్ష్యంగా చేసుకోవడం చాలా మంది ఎన్టీఆర్ అభిమానులకు కోపం తెప్పించింది. 

ఈ వివాదంతో ఇప్పుడు నందమూరి అభిమానులు కూడా ఇప్పుడు రెండుగా చీలిపోయారు. ఈ క్రమంలో జూనియర్ ఎన్టీఆర్ అభిమానులు టీవీ ఛానెల్‌ల పై BoycottABNandMahaaNews అనే హ్యాష్‌ట్యాగ్‌తో ఎదురుదాడి మొదలెట్టారు. ఈ వివాదం అటు తిరిగి ఇటు తిరిగి తమ వైపు టర్న్ అవటం ఈ ఛానెల్స్ కు షాక్ ఇస్తున్నాయి. 

 మార్చెయ్యటానికీ తీసెయ్యటానికి ఎన్‌టిఆర్‌ అన్నది పేరుకాదు. ఓ సంస్కృతి.. ఓ నాగరికత.. తెలుగుజాతి వెన్నెముక. తండ్రి గద్దెనెక్కి ఎయిర్‌ పోర్ట్‌ పేరు మార్చాడు. కొడుకు గద్దెనెక్కి యూనివర్సిటీ పేరు మారుస్తున్నాడు. మిమ్మల్ని మార్చటానికి ప్రజలున్నారు. పంచభూతాలున్నారు తస్మాత్‌ జాగ్రత్త. అక్కడ ఆ మహనీయుడు పెట్టిన భిక్షతో బతుకుతున్న నేతలున్నారు.. పీతలున్నారు.. విశ్వాసంలేని వాళ్లని చూసి కుక్కలు వెక్కిరిస్తున్నాయి. శునకాలముందు తలవంచుకు బతికే సిగ్గులేని బతుకులు ' అంటూ... బాలయ్య ఘాటుగా విమర్శించారు.
 

Follow Us:
Download App:
  • android
  • ios