ఫ్యాన్స్ ని మళ్లీ డిజప్పాయింట్ చేస్తున్న ఎన్టీఆర్ ?
ఈ లోపు ఎన్టీఆర్ ఆడియెన్స్ ని, తన ఫ్యాన్స్ ని అలరించేందుకు సిద్ధమయ్యారు. `ఎవరు మీలో కోటీశ్వరుడు` రూపంలో ఆడియెన్స్ ని ఎంటర్‌టైన్ చేయాలని భావించారు. కానీ..
ఎన్టీఆర్ వెండితెరపై కనిపించక మూడేళ్లవుతుంది. చివరగా ఆయన `అరవింద సమేత` చిత్రంతో వచ్చారు. త్రివిక్రమ్ దర్శకత్వంలో రూపొందిన ఈ సినిమా 2018లో విడుదలైంది. ఆ తర్వాత ఎన్టీఆర్ `ఆర్‌ఆర్‌ఆర్`లో లాక్ అయిపోయారు. గతేడాది ఈ సినిమా విడుదల కావాల్సి ఉంది. కానీ కరోనాతో వాయిదా పడుతూ వస్తోంది. ఈ ఏడాది అక్టోబర్ 13న రిలీజ్‌కి ప్లాన్ చేశారు. ఇప్పుడు సెకండ్ వేవ్ కరోనా కారణంగా ఆ టైమ్‌కి కూడా విడుదలవుతుందా? మళ్లీ వాయిదా పడుతుందా? అన్నది సస్పెన్స్ గా మారింది.
ఇదిలా ఉంటే ఈ లోపు ఎన్టీఆర్ ఆడియెన్స్ ని, తన ఫ్యాన్స్ ని అలరించేందుకు సిద్ధమయ్యారు. `ఎవరు మీలో కోటీశ్వరుడు` రూపంలో ఆడియెన్స్ ని ఎంటర్‌టైన్ చేయాలని భావించారు. జీతెలుగు ఈ షోని ప్లాన్ చేసింది. అధికారికంగా ప్రకటించడంతోపాటు మే నెలలో ప్రారంభం కాబోతుందనే ప్రచారం కూడా జరిగింది. ఇప్పటికే పలు ప్రోమోలు, ఇందులో పాల్గొనే కంటెస్టెంట్ల ఎంపిక కూడా జరుగుతుంది. ఇక సెకండ్ వేవ్ కరోనాతో థియేటర్లన్నీ మూత పడటంతో టీవీలో `ఎవరు మీలో కోటీశ్వరుడు` షోనైనా చూసి రిలాక్స్ అవ్వాలని ఆడియెన్స్, ఎన్టీఆర్ ని అయినా చూడొచ్చని ఆయన ఫ్యాన్స్ ఎన్నో ఆశలతో ఉన్నారు.
కానీ ఇప్పుడు ఈ షోపై కూడా కరోనా ఎఫెక్ట్ పడిందని తెలుస్తుంది. వైరస్ విజృంభిస్తోన్న నేపథ్యంలో ఈ షోని వాయిదా వేయాలని నిర్వహకులు భావిస్తున్నారట. దీంతో ఈ నెలలో షో ప్రారంభం కావడం లేదని, జూన్ చివరి వారంలోగానీ, జులైలోగానీ దీన్ని ప్రారంభించాలని యోచిస్తున్నట్టు సమాచారం. దీంతో ఎన్టీఆర్ ఫ్యాన్స్ కాస్త డిజప్పాయింట్ అవుతున్నట్టు తెలుస్లుంది. మరి ఇందులో నిజమెంతా అనేది తెలియాల్సి ఉంది. కరోనా ఉధృతి కారణంగా `ఆర్‌ఆర్‌ఆర్` షూటింగ్ కూడా వాయిదా పడింది. ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ వర్క్ పై ఫోకస్ పెట్టారు.