ఆర్ ఆర్ ఆర్ లో ఎన్టీఆర్, రామ్ చరణ్ ఇంట్రో సీన్స్ సినిమాకే హైలెట్ అని చెప్పాలి. ముఖ్యంగా వేల మంది నిరసనకారుల మధ్యలోకి దూకి రామ్ పోరాట సన్నివేశం అబ్బురపరిచింది. అయితే ఈ తరహా సీన్ ఎన్టీఆర్ ఎప్పుడో చేసేశాడంటూ ఎన్టీఆర్ ఫ్యాన్స్ ఓ వీడియో వైరల్ చేస్తున్నారు.


ప్రేక్షకులకు గూస్ బంప్స్ కలిగించిన ఆర్ ఆర్ ఆర్ సన్నివేశాల్లో రామ్ చరణ్ ఎంట్రీ ఒకటి. బ్రిటీష్ ఆఫీసర్ ఆదేశం మేరకు వేల మంది నిరసకారులను ఒక్కడే చెదరగొట్టి రామ్ చరణ్ ఒకడ్ని పట్టుకొని వస్తాడు. ఈ సన్నివేశం తెరకెక్కించడానికి రాజమౌళి రోజుల తరబడి రీసెర్చ్ చేశాడు. సహజంగా అనిపిస్తూ ఆ సీరియస్నెస్ రావడానికి కష్టపడ్డారు. అయితే ఈ తరహా సన్నివేశం ఎన్టీఆర్ ఎప్పుడో చేశాడంటూ ఫ్యాన్స్ ఓ వీడియో వైరల్ చేస్తున్నారు. 

Add Asianetnews Telugu as a Preferred SourcegooglePreferred

దర్శకుడు సురేంధర్ రెడ్డి 2011లో ఊసరవెల్లి మూవీ తెరకెక్కించాడు. ఈ మూవీలో ఎన్టీఆర్ కిరాయి రౌడీగా నటించాడు. డబ్బులు ఇస్తే ఎవడినైనా కొట్టేస్తాడు. దానిలో భాగంలో ఓ సన్నివేశంలో ఒకడ్ని కొట్టడానికి వందల మందితో ఫైట్ కి దిగుతాడు. ఇది ఆర్ ఆర్ ఆర్ లో రామ్ చరణ్ ఎంట్రీని పోలి ఉంది. చరణ్ మాదిరి ఎన్టీఆర్ ఒక రాడ్ తీసుకొని గుంపులోకి దూకుతాడు. అందరినీ చెదరగొడుతూ టార్గెట్ పర్సన్ కోసం వెతుకుతూ ఉంటాడు. ఈ వీడియో బయటికి తీసి ఎన్టీఆర్ ఫ్యాన్స్ వైరల్ చేస్తున్నారు. 

Scroll to load tweet…

ఇక రాజమౌళి సినిమాలకు కాపీ మరకలు చాలా సాధారణం. ఆయన సినిమాల్లో సన్నివేశాలు ఖచ్చితంగా హాలీవుడ్ లేదా బాలీవుడ్ కి చెందిన గత చిత్రాల్లో సన్నివేశాలను పోలి ఉంటాయి అంటారు. రాజమౌళి ఈ విమర్శలేవీ పట్టించుకోరు. ప్రేక్షకుడికి గొప్ప అనుభూతిని పంచడమే లక్ష్యంగా పని చేస్తారు. అవి కాపీనా లేక స్ఫూర్తి పొందాడా అనేది పక్కన పెడితే మనం ఎంజాయ్ చేశామా లేదా అన్నదే పాయింట్. 

ప్రస్తుతం రాజమౌళి మహేష్ మూవీ ప్రీ ప్రొడక్షన్ పనుల్లో నిమగ్నమైన ఉన్నాడు. స్క్రిప్ట్ కూడా లాక్ చేసినట్లుగా తెలుస్తుంది. వచ్చే ఏడాది ప్రారంభంలోనే మూవీ సెట్స్ పైకి వెళ్లే సూచనలు కలవు. బాహుబలి, ఆర్ ఆర్ ఆర్ చిత్రాలకు మించి భారీ బడ్జెట్ తో రాజమౌళి మహేష్ మూవీ తెరకెక్కిస్తారని సమాచారం. ఈ ప్రాజెక్ట్ పై అప్పుడే అంచనాలు ఏర్పడ్డాయి.