Asianet News TeluguAsianet News Telugu

హాస్పిటల్ లో సైఫ్ అలీఖాన్, షూటింగ్ లో గాయపడ్డ దేవర నటుడు

బాలీవుడ్ స్టార్ నటుడు కరీనా కపూర్ భర్త సైఫ్ అలీ ఖాన్ హాస్పిటల పాలు అయినట్టు తెలుస్తోంది. ముంబయ్ లోని కార్పోరేట్ హాస్పిటల్లో ఆయనకు ట్రీట్మెంట్ జరుగుతుందట. ఇంతకీ సైఫ్ కు ఏమయ్యింది.  

NTR Devara Movie villain Saif Ali Khan Injured in Shooting JMS
Author
First Published Jan 23, 2024, 10:13 AM IST | Last Updated Jan 23, 2024, 10:13 AM IST

NTR Devara Movie villain Saif Ali Khan Injured in Shooting JMS బాలీవుడ్ స్టార్ నటుడు సైఫ్ అలీఖాన్ హాస్పిటలైజ్ అయ్యారు. ముంయ్ లోని ప్రవేట్ హాస్పిటల్ లో ఆయన ట్రీట్మెంట్ తీసుకుంటన్నారు. ఓ ప్రమాదంలో సైఫ్ మోకాలికి, భుజాలకి గాయాలు అయినట్టు తెలుస్తోంది.  దీంతో ఆయన సర్జరీ కోసం హాస్పిటల్ లో జాయిన్ అయ్యినట్లు తెలుస్తుంది. కాగా సైఫ్ అలీఖాన్ ప్రస్తుతం ఎన్టీఆర్ దేవర సినిమాలో నటిస్తున్న సంగతి తెలిసిందే. ఈ చిత్రంలో సైఫ్ అలీఖాన్ విలన్ గా కనిపించబోతున్నారు. 

అయితే సైఫ్ కు ఈ గాయాలు ఓ షూటింగ్ లో అయినట్టు తెలుస్తోంది. ప్రస్తుతం సైఫ్ చేస్తున్న భారీ యాక్షన్ మూవీ దేవర. ఇక దేవర మూవీ భారీ యాక్షన్ సీన్స్ ఉంటాయన్న సంగతి తెలిసిందే.. దాంతో  ఈ మూవీ షూటింగ్ లోనే సైఫ్ కు గాయాలు అయ్యాయన్న డౌట్ వస్తుంది అందరికి. కాని ఈ రకంగా ఎటువంటి ప్రకటన రాలేదు. అంతే కాదు.. మోకాలి గాయం కారణంగా శస్త్రచికిత్స చేయాలని వైద్యులు ఇప్పటికే ఆయనకు సూచించారు. గతంలో సైఫ్ కు తగిలిన గాయాల కారణంగా సైఫ్ ను జాగ్రత్తగా ఉండాలని వైధ్యులు సూచించారు. కాని ఆయన  విశ్రాంతి లేకుండా సినిమాల్లో నటిస్తుండడంతో సకాలంలో చికిత్స, సర్జరీ చేయించుకోలేకపోయాడు. 

 

ఈ సందర్భంలో ప్రస్తుతం కొందరు ప్రముఖ నటీనటుల చిత్రాల్లో విలన్‌గా నటిస్తున్న సైఫ్ అలీఖాన్.. ఓ యాక్షన్ సీన్‌లో నటిస్తుండగా మళ్లీ మోకాలికి తగలడంతో నొప్పి రావడంతో ముంబైలోని కోకిలాపెన్ హాస్పిటల్‌లో చేరాడు. ఈ ఘటన బాలీవుడ్‌తో పాటు దక్షిణాది అభిమానులను దిగ్భ్రాంతికి గురి చేసింది. సైఫ్ అలీఖాన్ ఆరోగ్య పరిస్థితి నిలకడగా ఉన్నప్పటికీ మోకాలి నొప్పి విపరీతంగా ఉండడంతో వెంటనే శస్త్ర చికిత్స చేయాలని వైద్యులు చెప్పారని, అందుకు సన్నాహాలు జరుగుతున్నాయని సైఫ్ అలీఖాన్ ఆరోగ్యంపై విడుదల చేసిన సమాచారం. అతని భార్య కరీనా కపూర్ ప్రస్తుతం సైఫ్ అలీ ఖాన్‌తో ఉన్నారు. 

అయితే సైఫ్ గాయపడింది దేవర సినిమా షూటింగ్ లో కాదు అనేది సమాచారం.సైఫ్ అలీ ఖాన్ జూనియర్ ఎన్టీఆర్ సినిమాతో పాటుగా  విశాల్ భరద్వాజ్ నటించిన రంగూన్ షూటింగ్ సమయంలో సైఫ్ చాలాసార్లు గాయపడ్డాడు. విడుదలలకు వెళ్లేటప్పుడు కూడా ఆమె క్రేప్ బ్యాండేజ్ ధరించి కనిపించింది. అయితే ఇప్పుడు మోకాలికి సర్జరీ చేయబోతున్నట్లు నిర్ధారణ అయింది.


 

Latest Videos
Follow Us:
Download App:
  • android
  • ios