ఎన్టీఆర్ దేవర క్లైమాక్స్ కోసం భారీ ప్లాన్, కొరటాల మామూలోడు కాదుగా..
దేవర సినిమా ఎప్పుడు థియేటర్లలోకి వస్తుందా అని ఎదరు చూస్తూ ఉన్నారు. ఇటు తెలుగు రాష్ట్రాలతో పాటు.. పాన్ఇండియా రేంజ్ లో ఫ్యాన్స్ ఎదరు చూస్తున్నారు. సామాన్యుల తో పాటు సెలబ్రిటీల కూడా ఈ సినిమా కోసం ఉత్కంటతో ఎదురుచూస్తున్నారు.
యంగ్ టైగర్ ఎన్టీఆర్ నటిస్తున్న దేవర సినిమా గురించి ఫ్యాన్స్ ఎంతగా ఎదురు చూస్తున్నారో ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. ఆర్ఆర్ఆర్ తరువాత తారక్ నుంచి ఇంత వరకూ సినిమా రాకపోవడంతో ఫ్యాన్స్ మంచి ఆకలి మీద ఉన్నారు. అంతే కాదు దేవర సినిమా ఎప్పుడు థియేటర్లలోకి వస్తుందా అని ఎదరు చూస్తూ ఉన్నారు. ఇటు తెలుగు రాష్ట్రాలతో పాటు.. పాన్ఇండియా రేంజ్ లో ఫ్యాన్స్ ఎదరు చూస్తున్నారు. సామాన్యుల తో పాటు సెలబ్రిటీల కూడా ఈ సినిమా కోసం ఉత్కంటతో ఎదురుచూస్తున్నారు.
స్టార్ డైరెక్టర్ కొరటాల శివ దర్శకత్వంలో యంగ్ టైగర్ ఎన్టీఆర్ హీరోగా.. బాలీవుడ్ బ్యూటీ జాన్వీ కపూర్ హీరోయిన్ గా నటిస్తోన్న ఈమూవీ షూటింగ్ డిలై అవుతుండగా.. ఏప్రిల్ 5న రిలీజ్ అవ్వాల్సిన ఈమూవీ పోస్ట్ పోన్ అయినట్టు తెలుస్తోంది. షూటింగ్ చేస్తున్న కొద్ది పెండింగ్ పడుతూనే ఉంది. తాజాగా ఈమూవీ షూటింగ్ లోనే సైఫ్ అలీ ఖాన్ గాయపడిసర్జరీ అయినట్టు సమాచారం. అటు ఎన్టీఆర్ కూడా షూటింగ్ కు 20 రోజులు గ్యాప్ ఇచ్చి.. తాజాగా షూటింగ్ మళ్లీ స్టార్ చేశారు.
ప్రస్తుతం ఈమూవీ షూటింగ్ హైదరాబాద్ లోని అల్యూమినియం ఫ్యాక్టరీలో జరుగుతోంది.అయితే దాదాపు ఈమూవీ షూటింగ్ అయిపోవచ్చింది. అనిరుథ్ మ్యూజిక్ లేట్ అవుతోంది. సాంగ్స్ కంప్లీట్ చేస్తే.. ఆ షూటింగ్ కూడా అయిపోతుంది. ఇక తాజా సమాచారం ప్రకారం మూవీ టీమ్ క్లైమాక్స్ షూట్ కి సన్నాహాలు చేసుకుంటున్నట్టు తెలుస్తోంది. కోటి రూపాయల భారీ స్విమ్మింగ్ ఫూల్ సెట్‌లో దేవర క్లైమాక్స్ యాక్షన్ సన్నివేశాలను చిత్రీకరిస్తారట. ఎన్టీఆర్ అభిమానులకు ఈ యాక్షన్ సీక్వెన్స్ కనుల విందుగా ఉంటుందని టాక్. ఇక ఈ సినిమాలో ఎన్టీఆర్ చాలా ఇంటెన్స్ క్యారెక్టర్ లో కనిపించబోతున్నాడు.
కాగా ఈ సినిమాలో బాలీవుడ్ బ్యూటీ జాన్వీ కపూర్ కథానాయికగా నటిస్తుంది. ఈ సినిమా కోసం లెంగ్తీ షెడ్యూళ్లు ప్లాన్ చేస్తున్నాడు కొరటాల. కాబట్టి.. ఈ సినిమా షూట్ వేగంగా జరుగుతుంది. అన్నట్టు ఈ సినిమాలో ఎన్టీఆర్ లుక్ కూడా అదిరిపోతోందట. అందుకు తగ్గట్టుగానే తన పాత్ర కోసం తారక్ కూడా డిఫరెంట్ మేకోవర్ ట్రై చేస్తున్నాడు. మొత్తానికి దేవర సినిమాపై రోజురోజుకూ అంచనాలు పెరుగుతున్నాయి.