యంగ్ టైగర్ ఎన్టీఆర్ కి కరోనా సోకిందన్న వార్త ఆయన అభిమానులు తీవ్ర ఆందోళనకు గురిచేసింది. మే 10వ తేదీన ఎన్టీఆర్ తనకు కరోనా పాజిటివ్ గా నిర్ధారణ అయినట్లు వెల్లడించారు. ఎన్టీఆర్ కి కరోనా అని తెలిసి ఫ్యాన్స్, చిత్ర ప్రముఖులు ఆయన త్వరగా కోలుకోవాలని ప్రార్ధనలు చేయడం జరిగింది. కాగా నేడు రంజాన్ పండుగను పురస్కరించుకొని ఎన్టీఆర్ ముస్లిం సోదరులకు ఈద్ విషెష్ తెలియజేశారు.


అదే సమయంలో తన ఆరోగ్యం గురించి కూడా ఎన్టీఆర్ సమాచారం ఇచ్చారు. నేను కరోనా నుండి కోలుకోవాలన్న మీ ప్రార్థనలకు కృతఙ్ఞతలు. నా ఆరోగ్యం మెరుగుపడుతుంది. త్వరలోనే కోవిడ్ నెగిటివ్ గా ఫలితం వస్తుందని ఆశిస్తున్నాను. అందరూ జాగ్రత్తగా ఉండండి.. అంటూ ఎన్టీఆర్ ట్వీట్ చేశారు. ఎన్టీఆర్ కి ఎలా ఉందో అని భయపడుతున్న ఫ్యాన్స్ కి ఆయన ట్వీట్ కొండంత బలం చేకూర్చింది. 


మరోవైపు కరోనా వ్యాప్తి నేపథ్యంలో ఆర్ ఆర్ ఆర్ షూటింగ్ కి బ్రేక్ పడినట్లు సమాచారం. ఆర్ ఆర్ ఆర్ షూటింగ్ చివరి దశకు చేరుకోగా అక్టోబర్ 13న విడుదల చేయనున్నట్లు దర్శకుడు రాజమౌళి ప్రకటించారు. ఎన్టీఆర్ కొమరం భీమ్ గా నటిస్తున్న ఈ చిత్రంలో మరో స్టార్ చరణ్ రామరాజు పాత్ర చేస్తున్న విషయం తెలిసిందే. ఇక ఆర్ ఆర్ ఆర్ తరువాత ఎన్టీఆర్ దర్శకుడు కొరటాల శివతో మూవీ చేయనున్నారు. దీనిపై అధికారిక ప్రకటన విడుదలైంది.