మహేష్ తో పాటు పలువురు స్టార్స్ రామ్ చరణ్ కి బర్త్ డే విషెష్ తెలియజేయడం జరిగింది. అయితే ఎన్టీఆర్ ఓ స్పెషల్ పిక్ పంచుకోవడంతో పాటు ఆసక్తికర కామెంట్స్ చేశారు. మన ఇద్దరి జీవితాలలో ఈ ఏడాది మరపురానిది కానుంది. నీతో గడిపిన ప్రతి క్షణం అద్భుతం బ్రదర్... అంటూ ఎన్టీఆర్ చరణ్ కి ప్రత్యేకంగా బర్త్ డే విషెష్ తెలియజేశారు.
యంగ్ మెగా హీరో రామ్ చరణ్ నేడు తన 36వ బర్త్ డే జరుపుకుంటున్నారు. దీనితో చిత్ర ప్రముఖులు, అభిమానులు ఆయన బర్త్ డే వేడుకలు ఘనంగా నిర్వహిస్తున్నారు. మహేష్ తో పాటు పలువురు స్టార్స్ రామ్ చరణ్ కి బర్త్ డే విషెష్ తెలియజేయడం జరిగింది. అయితే ఎన్టీఆర్ ఓ స్పెషల్ పిక్ పంచుకోవడంతో పాటు ఆసక్తికర కామెంట్స్ చేశారు. మన ఇద్దరి జీవితాలలో ఈ ఏడాది మరపురానిది కానుంది. నీతో గడిపిన ప్రతి క్షణం అద్భుతం బ్రదర్... అంటూ ఎన్టీఆర్ చరణ్ కి ప్రత్యేకంగా బర్త్ డే విషెష్ తెలియజేశారు.
షూటింగ్ సెట్స్ లో ఇద్దరూ కలిసి దిగిన ఫోటోను పంచుకున్నారు ఎన్టీఆర్. దర్శక ధీరుడు రాజమౌళి తెరకెక్కిస్తున్న ఆర్ ఆర్ ఆర్ మూవీలో ఎన్టీఆర్, చరణ్ నటిస్తున్న విషయం తెలిసిందే. ఎన్టీఆర్ కొమరం భీమ్ రోల్ చేస్తుండగా , చరణ్ అల్లూరి సీతారామరాజు పాత్ర చేస్తున్నారు. తెల్లదొరల పాలనపై కలిసి పోరాటం చేసే యోధులుగా వీరిని రాజమౌళి చూపించనున్నాడు.
మరో ఆసక్తికర అంశం, అల్లూరిగా నటిస్తున్న చరణ్ తమ్ముడు భీమ్ గా ఎన్టీఆర్ నటిస్తున్నారు. ఇక చరణ్ బర్త్ డే కానుకగా నిన్న ఆర్ ఆర్ ఆర్ నుండి అల్లూరిగా చరణ్ లుక్ విడుదల చేశారు. విల్లుపట్టుకొని వీరోచితంగా పోరాడుతున్న చరణ్ లుక్ కి ప్రసంశలు దక్కాయి. ఆర్ ఆర్ ఆర్ అక్టోబర్ 13న ఐదు భాషల్లో ప్రపంచ వ్యాప్తంగా విడుదల కానుంది.
