బాలీవుడ్ స్టార్ కపుల్స్ రణ్‌బీర్ కపూర్ (Ranbir Kapoor), ఆలియా భట్ (Alia Bhatt) జంటగా నటించిన లేటెస్ట్ మూవీ బ్రహ్మాస్త్ర (Brahmastra). తెలుగులో బ్రహ్మాస్త్రం పేరుతో రిలీజ్ కాబోతుంది. అయాన్ ముఖర్జీ (Ayan Mukerji) దర్శకత్వంలో రూపొందిన ఈ సినిమా మొత్తం మూడు భాగాలుగా రానుంది. మొదటి భాగం సెప్టెంబర్ 9న విడుదల కానుంది. ప్రస్తుతం ఈ మూవీ ప్రమోషన్ కార్యక్రమాలు చురుగ్గా సాగుతున్నాయి.
బాలీవుడ్ జంట రణ్‌బీర్ కపూర్(Ranbir Kapoor), అలియా భట్(Alia Bhatt) తాజా చిత్రం ‘బ్రహ్మాస్త్ర’: మొదటి భాగం-శివ’(Brahmastra: Part One-Shiva). ఈ చిత్రం ప్రమోషన్స్ గత కొంతకాలంగా జరుగుతున్నాయి . ఇప్పటికే హిందీ మీడియాతో అలియా భట్, సౌత్‌లో రణ్‌బీర్, నాగార్జున(Nagarjuna) బ్రహ్మాస్త్ర ప్రమోషన్స్‌లో పాల్గొంటున్నారు. చెన్నైలో జరిగిన మీడియా సమావేశానికి అగ్ర దర్శకుడు ఎస్.ఎస్ రాజమౌళి(S.S.Rajamouli)ని అతిథిగా ఆహ్వానించారు. ఇప్పుడు తెలుగులోనూ ఈ సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్ జరగబోతోంది. ఈ ఈవెంట్ కు ఓ స్టార్ హీరోని తెలుగు నుంచి పిలిచారు. ఆ హీరో మరెవరో కాదు జూ.ఎన్టీఆర్. రీసెంట్ గా బింబసార చిత్రం ప్రీ రిలీజ్ ఈవెంట్ లో పాల్గొన్న ఆయన ఆ సినిమా సక్సెస్ కావటంతో చాలా ఆనందంతో ఉన్నారు. ఇప్పుడు ఈ సినిమా ప్రీ రిలీజ్ పంక్షన్ కు వస్తారని సమాచారం. సెప్టెంబర్ 2 న ఈ ఈవెంట్ హైదరాబాద్ లో జరగనుందని సమాచారం. అయితే అఫీషియల్ గా ప్రకటన ఏదీ ఇప్పటిదాకా రాలేదు.
సెప్టెంబరులో విడుదల కానున్న ఈ భారీ బడ్జెట్ సినిమాపై చిత్ర యూనిట్ భారీ ఆశలే పెట్టుకుంది. అమితాబ్ బచ్చన్(Amitabh Bachchan), నాగార్జున ప్రత్యేక పాత్రల్లో నటిస్తున్న ఈ ఫాంటసీ అడ్వెంచర్ చిత్రంలో షారుక్ ఖాన్(Shah Rukh Khan) అతిథి పాత్రలో మెరవనున్నారు. సుమారు రూ.500 కోట్ల వ్యయంతో నిర్మించిన ఈ చిత్రానికి అయాన్ ముఖర్జీ(Ayan Mukerji) దర్శకత్వం వహించగా, కరణ్‌జోహార్(Karan Johar), రణ్‌బీర్‌కపూర్ సంయుక్తంగా నిర్మించారు. మొత్తం మూడు భాగాలుగా ఈ చిత్రం రానుంది.
రాజమౌళి మాట్లాడుతూ... ‘చిన్నప్పటి నుంచి మనం చదువుకున్న, ఊహించుకున్న అస్త్రాల గొప్పతనాన్ని దర్శకుడు అయాన్ ముఖర్జీ ప్రపంచానికి చూపించబోతున్నారు. దానికోసం అద్భుతమైన ప్రపంచాన్ని ఆయన సృష్టించారు. ‘అస్త్రాల’ కథను కమర్షియల్ కోణంలో చెప్పడం నాకు బాగా నచ్చింది. ‘బ్రహ్మాస్త్ర’తో భారతీయ సంస్కృతి, పురాణాల వైభవం ప్రపంచానికి మరింత గొప్పగా పరిచయం కానుంది. అయాన్ కన్న కలలకు దృశ్యరూపమిది. ఆయనకు కరణ్ జోహార్, రణ్‌బీర్‌కపూర్, అలియా, నాగార్జున, అమితాబ్ సార్‌లు మద్దతు ఇచ్చారు. 2014నుంచి సాగుతున్న బ్రహ్మాస్త్ర సుదీర్ఘ ప్రయాణంలో నన్ను భాగం చేసినందుకు చిత్ర యూనిట్‌కు ధన్యవాదాలు’’ అని అన్నారు.
