లాక్‌డౌన్‌ ఎత్తేశారు. కరోనా ప్రభావం తగ్గుముఖం పడుతుంది. సినిమా షూటింగ్‌లు ఊపందుకుంటున్నాయి. ఇక సెలబ్రిటీలు సైతం ఫారెన్‌ ట్రిప్పులు స్టార్ట్ చేశారు. జనరల్‌గా ప్రతి ఏడాది రెండుమూడు సార్లు ఫారెన్‌ ట్రిప్పులు వేస్తుంటారు మన హీరోహీరోయిన్లు. ఈ ఏడాది కరోనా వల్ల దాదాపు ఎనిమిది నెలలు బయటకు వెళ్లలేని పరిస్థితి. ఇప్పుడు పరిస్థితి కుదుట పడుతుండటంతో వరుసగా ఫారెన్‌కి చెక్కేస్తున్నారు మన స్టార్స్. దీపావళికి కుటుంబంతో కలిసి అమెరికా వెళ్ళిన మహేష్‌ మూడు రోజుల క్రితమే హైదరాబాద్‌ చేరుకున్నారు.  

ఇప్పుడు ఎన్టీఆర్‌ సైతం షార్ట్ ట్రిప్‌ వేశారు. ఆయన ఎవరికీ తెలియకుండా దుబాయ్‌కి వెళ్లి వచ్చారు. బుధవారం ఆయన దుబాయ్‌ నుంచి హైదరాబాద్‌ వస్తూ ఎయిర్‌పోర్ట్ లో ఫోటోలకు చిక్కారు. తన కుమారుడు అభయ్‌, భార్య ప్రణతిలతో కలిసి ఆయన దుబాయ్‌ వెళ్ళారు. ఈ ఫోటోలు ఇప్పుడు సోషల్‌ మీడియాలో వైరల్‌ అవుతున్నాయి. ఇందులో ఎన్టీఆర్‌ మాస్క్ ధరించి, మెరూన్‌ కలర్‌ టీషర్ట్, జీన్స్  పాయింట్‌తో స్టయిలీష్‌గా కనిపిస్తున్నారు. 

ఎన్టీఆర్‌ ప్రస్తుతం `ఆర్‌ ఆర్‌ ఆర్‌`లో రామ్‌చరణ్‌తో కలిసి నటిస్తున్నారు. రాజమౌళి దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమా షూటింగ్‌ జరుపుకుంటోంది. రాత్రి పగలు అనే తేడా లేకుండా, వణికే చలిని కూడా లెక్కచేయకుండా నిర్విరామంగా షూటింగ్‌ జరుపుతున్నారు. ఇందులో ఎన్టీఆర్‌.. కొమురంభీమ్‌గా, రామ్‌చరణ్‌.. అల్లూరి సీతారామరాజుగా నటిస్తున్నారు. అలియాభట్‌, ఒలివీయా మోర్రిస్‌ హీరోయిన్లుగా, అజయ్‌ దేవగన్‌, సముద్రఖని, శ్రియా కీలక పాత్రలు పోషిస్తున్నారు.