‘వార్ 2’ కన్నా ముందే బాలీవుడ్ చిత్రంలో ఎన్టీఆర్?
2019లో వచ్చిన ‘వార్’కు సీక్వెల్‍గా ‘వార్ 2’ ఉండనుంది. జూనియర్ ఎన్టీఆర్ ఉండటంతో ‘వార్ 2’కు ఇప్పటికే ఫుల్ హైప్ ఉంది.

రాజమౌళి ప్యాన్ ఇండియా చిత్రం ‘ఆర్ఆర్ఆర్’తో తారక్ ఇప్పుడు పూర్తి స్థాయి బాలీవుడ్ మూవీకి రెడీ అయిపోయిన సంగతి తెలిసిందే. ఎన్టీఆర్ చేస్తున్న తొలి హిందీ చిత్రం యశ్ రాజ్ ఫిలిమ్స్ బేనర్ లో కావడం.. వాళ్లు తీసే స్పై యూనివర్శ్ సినిమాల్లోకి తారక్ కూడా ఎంట్రీ ఇస్తుండటం అది కూడా.. బ్లాక్ బస్టర్ మూవీ ‘వార్’ సీక్వెల్ కావటంతో ప్రాజెక్టుకు పిచ్చ క్రేజ్ వస్తుందనటంలో సందేహం లేదు.ఓవైపు హృతిక్..మరోవైపు ఎన్టీఆర్ తెరపై కనిపిస్తే .థియేటర్స్ లో మామూలుగా ఉండదు. టైగర్ ఎంట్రీ తో సౌత్ లో ఈ సినిమాకి క్రేజ్ పతాక స్థాయిలో క్రియేట్ అవుతుంది. అయితే ఈ వార్ 2 కు ముందే ఎన్టీఆర్ మరో బాలీవుడ్ చిత్రంలో కనిపించే అవకాసం ఉందంటున్నారు.
బాలీవుడ్ సినీ వర్గాల నుంచి అందుతున్న సమాచారం మేరకు ఎన్టీఆర్ పాత్ర ...వార్ 2 కన్నా ముందే టైగర్ 3లో కనిపించబోతోంది. అయితే టైగర్ 3 క్లైమాక్స్ లో ఎన్టీఆర్ మెరుపులా మెరుస్తారు అంటున్నారు. టైగర్ 3 అనేది సల్మాన్ ఖాన్ టైగర్ జిందా హై కు సీక్వెల్. ఈ సంవత్సరం ఆఖరులో రిలీజ్ అవుతోంది. ఎన్టీఆర్ పాత్రను అక్కడే పరిచయం చేసేస్తే ఆ తర్వాత వార్ 2 లో కీలకంగా మలచటానికి వీలుగా ఉంటుందని ప్రొడక్షన్ హౌస్ భావించి ఈ డెసిషన్ తీసుకుంది అంటున్నారు. ఈ ప్లానింగ్ అంతా స్పై యూనివర్స్ లో భాగంగానే జరుగుతోందంటున్నారు. ఈ వార్తే నిజమైతే టైగర్ 3 లో ఎన్టీఆర్ కనిపిస్తే..ఆయన వార్ 2 లో ఎలాంటి క్యారక్టర్ వేయబోతున్నారనే క్లారిటీ వచ్చేస్తుంది.
కాబట్టి ‘వార్-2’లోనూ హృతిక్ పాత్రను అలాగే కొనసాగించి.. కొత్తగా తారక్ పాత్రను జోడిస్తారు . 2019లో వచ్చిన ‘వార్’కు సీక్వెల్‍గా ‘వార్ 2’ ఉండనుంది. జూనియర్ ఎన్టీఆర్ ఉండటంతో ‘వార్ 2’కు ఇప్పటికే ఫుల్ హైప్ ఉంది. అయాన్ ముఖర్జీ ఈ చిత్రానికి దర్శకత్వం వహించనున్నారు. అయితే, వార్ 2 సినిమాను ఎప్పుడు రిలీజ్ చేయాలో మేకర్స్ ఓ టార్గెట్ నిర్దేశించుకున్నారని తెలుస్తోంది.వార్ 2 చిత్రాన్ని 2025 రిపబ్లిక్ డే సందర్భంగా థియేటర్లలో విడుదల చేయాలని యశ్ రాజ్ ఫిల్మ్స్ భావిస్తోందని తెలుస్తోంది. రిపబ్లిక్ డే వీకెండ్ అయిన 2025 జనవరి 24వ తేదీన ఈ సినిమాను రిలీజ్ చేయాలని ఆలోచిస్తోంది.
హాలీవుడ్ లో ఒక సినిమాకి ఇంకో సినిమాకి ఉండే కనెక్టివిటీ ఉన్న సినిమాటిక్ యూనివర్స్ మెల్లిమెల్లిగా ఇండియాకి కూడా పాకుతుంది. ఇప్పటికే తమిళ్ లో లోకేష్ సినిమాటిక్ యూనివర్స్, తెలుగులో ప్రశాంత్ వర్మ సినిమాటిక్ యూనివర్స్ నడుస్తున్నాయి. ఇప్పుడుబాలీవుడ్ లో YRF స్పై యూనివర్స్ నడుస్తుంది. పఠాన్ హిట్ అవ్వడంతో YRF ప్రొడక్షన్ లో వచ్చిన పాత స్పై సినిమాలు, పఠాన్, రాబోయే సినిమాలు, మరి కొన్ని కొత్త సినిమాలతో లింక్ చేస్తే YRF స్పై యూనివర్స్ రెడీ అవుతుంది అంటూ యశ్ రాజ్ ఫిలిమ్స్ అధికారికంగా ప్రకటించాయి. పఠాన్ సినిమా యాక్షన్ మూవీస్ లో సరికొత్త ట్రెండ్ సెట్ చేసింది.