ఎన్టీఆర్ బామ్మర్ది నితిన్ నార్నే ఇటీవల `మ్యాడ్` చిత్రంతో ఆడియెన్స్ కి పరిచయం అయ్యాడు. తాజాగా ఇప్పుడు మరో సినిమాని ప్రటించారు.
ఎన్టీఆర్ బామ్మర్ది నితిన్ నార్నే (లక్ష్మి ప్రణతి సోదరుడు) కూడా సినిమాల్లోకి ఎంట్రీ ఇచ్చిన విషయం తెలిసిందే. గతేడాది `మ్యాడ్` చిత్రంతో అలరించాడు. ఈ సినిమా పెద్ద విజయం సాధించింది. ఇందులో ముగ్గురు కుర్రాళ్లో ఒకరిగా కనిపించి మెప్పించాడు నితిన్ నార్నే. దీంతోపాటు మరో సినిమా చేస్తున్నాడు. తాజాగా ఇంకో సినిమాని ప్రకటించారు.
`ఆయ్` పేరుతో కొత్త సినిమాని ప్రకటించారు. జీఏ2 పిక్చర్స్ పతాకంపై అల్లు అరవింద్ సమర్పణలో ఈ మూవీని బన్నీ వాసు నిర్మిస్తున్నారు. అంజి కంచిపల్లి దర్శకత్వం వహిస్తున్నారు. తాజాగా టైటిల్ ప్రకటించారు. ఇందులో పచ్చని కొబ్బరి తోటల్లో ఒక కూల్ మూవీలా దీన్ని తెరకెక్కిస్తున్నట్టు పోస్టర్ ద్వారా తెలిపారు. ఈ సినిమాకి `మా ఫ్రెండ్స్ తో వస్తున్నామండీ` అనే క్యాప్షన్ ఇచ్చారు. మంచి కూల్ కామెడీ ఫ్యామిలీ ఎంటర్‌టైనర్‌గా ఈ మూవీ ఉండబోతుందని తెలుస్తుంది. రేపు ఉదయం 11గంటలకు ఫస్ట్ లుక్‌ని విడుదల చేయబోతున్నారు.
ఇక నితిన్ నార్నే మొదటగా `శ్రీ శ్రీ శ్రీ రాజావారు` అనే సినిమాని ప్రకటించిన విషయం తెలిసిందే. ఈ చిత్రానికి సంబంధించి ఎలాంటి అప్‌డేట్ లేదు. ఆ తర్వాత వచ్చిన `మ్యాడ్` విడుదలై పెద్ద హిట్ అయ్యింది. కానీ ఆ సినిమా పరిస్థితేంటో క్లారిటీ లేదు. ఆగిపోయిందా అనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ఈ నేపథ్యంలో ఇప్పుడు కొత్త సినిమాని ప్రకటించడం విశేషం. ఇదిలా ఉంటే నితిన్ నార్నే తొలి చిత్రం `మ్యాడ్`లో పెద్దగా ఆకట్టుకోలేకపోయాడు. ఆయన పాత్ర చాలా వరకు సైలెంట్‌గా ఉండటంతో నితిన్‌పై రాంగ్ ఇంప్రెషన్ పడింది. మరి ఈ సినిమాతో ఎలా ఆకట్టుకుంటాడో చూడాలి.
