ఇటీవల కాలంలో వరుసగా బయోపిక్ లు దర్శనమిస్తున్న సంగతి తెలిసిందే. మహానటి ఇచ్చిన విజయంతో ఇతర బయోపిక్ లపై కూడా అంచనాలు పెరిగాయి. ఇప్పటికే ఎన్టీఆర్ సినిమా రెండు భాగాలుగా తెరకెక్కుతోంది. ఎలక్షన్స్ కి ముందు విడుదల కాబోయే ఈ సినిమా ఎలా ఉంటుందా అని చర్చించుకుంటున్నారు. 

క్రిష్ డైరెక్షన్ - బాలకృష్ణ తండ్రి పాత్రలో కనిపించడం ఇక ఇతర స్టార్ హీరోలు కూడా సినిమాలో భాగమవ్వడంతో సినిమా స్థాయి పెరిగింది. జనవరికి రానున్న ఈ సినిమాపై అంచనాలు పెరుగుతున్నాయి. ఇకపోతే అదే సమయానికి చంద్రబాబు బయోపిక్ చంద్రోదయం కూడా విడుదల కానుంది. పెద్దగా స్టార్ డమ్ లేని వారితో రూపొందుతున్న ఆ సినిమాలో ఎన్టీఆర్ పాత్ర కూడా ఉంటుందట. 

సీఎం అవ్వక ముందు బాల్యం.. అలాగే రాజకీయ ఓనమాలు.. సీఎం తరువాత జరిగిన పరిణామాల గురించి చంద్రోదయంలో క్లియర్ గా చూపిస్తారట. రీసెంట్ గా చిత్ర యూనిట్ చంద్రబాబుకి సినిమా గురించి వివరించి బ్లెస్సింగ్ తీసుకొని సినిమాను సంక్రాంతికి విడుదల చేయనున్నట్లు చెప్పేశారు. అదే సమయానికి ఎన్టీఆర్ కథానాయకుడు రానుంది. మధ్యలో వర్మ లక్ష్మీస్ ఎన్టీఆర్ కూడా రానుంది. 

అయితే ఎన్టీఆర్ కు ఉన్న క్రేజ్ చంద్రోదయం సినిమాకు ఎఫెక్ట్ అవ్వదా అనే తరహాలో ఆలోచన రాకుండా ఉండదు. మరి ఆ రెండు సినిమాలా క్లాష్ ఎలా ఉంటుందో తెలియాలంటే రిలీజ్ వరకు వెయిట్ చేయాల్సిందే.