బయోపిక్ ను తెరకెక్కించడం ఒక ఎత్తైతే ఆ కథ కోసం నటీనటులను ఎంపిక చేయడం మరొక ఎత్తు. పాత్రలను కరెక్ట్ గా ప్రజెంట్ చేయగలిగితే ఆడియెన్స్ కి కనెక్ట్ అవుతుంది. ఎన్టీఆర్ బయోపిక్ కోసం కూడా దర్శకుడు క్రిష్ అదే విధంగా అడుగులు వేస్తున్నాడు.
బయోపిక్ ను తెరకెక్కించడం ఒక ఎత్తైతే ఆ కథ కోసం నటీనటులను ఎంపిక చేయడం మరొక ఎత్తు. పాత్రలను కరెక్ట్ గా ప్రజెంట్ చేయగలిగితే ఆడియెన్స్ కి కనెక్ట్ అవుతుంది. ఎన్టీఆర్ బయోపిక్ కోసం కూడా దర్శకుడు క్రిష్ అదే విధంగా అడుగులు వేస్తున్నాడు. వీలైనంత వరకు సినిమాలో నటీనటులనే ఎంపిక చేసుకుంటున్నాడు. కొత్తవారు పెద్దగా కనిపించే అవకాశం లేదు.
ఎన్టీఆర్ పాత్రలో బాలకృష్ణ నటిస్తున్న సంగతి తెలిసిందే. ఇక రానా - రకుల్ ప్రీత్ సింగ్ -విద్యాబాలన్ - సుమంత్ - కళ్యాణ్ రామ్ వంటి వారు సినిమాలో కీలకపాత్రల్లో నటిస్తున్నారు. అసలు విషయంలోకి వస్తే చంద్రబాబు పాత్రలో రానా కనిపిస్తుండగా ఆయన సతీమణి భువనేశ్వరి పాత్రలో మలయాళం హీరోయిన్ ని సెలెక్ట్ చేసినట్లు తెలుస్తోంది.
సాహసమే శ్వాసగా సాగిపో సినిమా ద్వారా కుర్రకారు మనసును దోచుకున్న మంజిమా మోహన్ ని ఇటీవల ఆడిషన్స్ నిర్వహించి ఫైనల్ చేశారు. చంద్రబాబు భార్య పాత్రను కూడా సినిమాలో కీలకం కానుండడంతో మంజిమ మోహన్ ను దర్శకుడు సెలెక్ట్ చేసుకున్నాడు. ఇక రెండు భాగాలుగా తెరకెక్కుతున్న ఈ బయోపిక్ లో మొదటి పార్ట్ ఎన్టీఆర్ సినిమా కెరీర్ కు సంబందించినది. సంక్రాంతి కానుకగా ఆ సినిమాను రిలీజ్ చేయాలనీ బాలకృష్ణ ప్లాన్ చేస్తున్నారు.
