యంగ్ టైగర్ ఎన్టీఆర్ (NTR) నటవిశ్వరూపం గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. ఇటీవల బ్లాక్ బాస్టర్ ఫిల్మ్ ‘ఆర్ఆర్ఆర్’తో కోమురం భీంగా అదరగొట్టిన విషయం తెలిసిందే. అయితే ఈ మూవీలోని ఓ ఇంక్రెడిబుల్ షాట్ ఇప్పుడు ప్రపంచ వ్యాప్తంగా వైరల్ అవుతోంది.
టాలీవుడ్ స్టార్ డైరెక్టర్, దర్శకధీరుడు ఎస్ఎస్ రాజమౌళి దర్శకత్వం వహించిన ‘ఆర్ఆర్ఆర్’ (RRR) చిత్రం ఇప్పటికీ ఏదో రకంగా ట్రెండింగ్ లోనే ఉంటుంది. ఈ మూవీలో టాలీవుడ్ స్టార్ హీరోలు యంగ్ టైగర్ ఎన్టీఆర్, మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ (Ram Charan) కలిసి నటించారు. అల్లూరి సీతారామరాజు పాత్రలో చరణ్, గొండు బెబ్బులి కోమురం భీం (Bheem)గా ఎన్టీఆర్ నటించారు. మార్చి 24న ప్రేక్షకుల ముందుకు వచ్చి దాదాపు నాలుగు నెలలు గడుస్తున్నా ఈ చిత్రం క్రేజ్ మాత్రం ఏమాత్రం తగ్గడం లేదు. ఇప్పటికే ఇండియాతో పాటు దేశ వీదేశీయులు సినిమాపై ప్రశంసల వర్షం కురిపిస్తున్నారు.
ఆర్ఆర్ఆర్ లో ఎన్టీఆర్ నటించిన ఓ సీన్ ఇంటర్నెట్ ను షేక్ చేస్తోంది. కేవలం రెండు రోజుల్లోనే 12 మిలియన్ల వ్యూస్ ను సొంతం చేసుకుంది. అంతేకాకుండా ట్విట్టర్ లో తొలిసారిగా వన్ మిలియన్ వ్యూస్ దక్కించుకున్న వీడియో క్లిప్ గా ఎన్టీఆర్ నటించిన సన్నివేశం ట్రెండ్ అవుతోంది. దీంతో తెలుగు చలన చిత్రంలో సోషల్ మీడియా క్రేజ్ లో ఎన్టీఆర్ తొలి రికార్డును క్రియేట్ చేశారు. ఇంతకీ.. వీడియోలో ఏముందంటే.. ‘ఆర్ఆర్ఆర్’లోని ఇంటర్వెల్ కు సంబంధించిన సన్నివేశం ఉంది. బ్రిటిష్ పాలకుల ప్యాలెస్ లో ట్రక్ నుంచి జంతువులతో ఎన్టీఆర్ బయటికి దూకే సీన్. ఈ ఒక్క షాట్ ఇండియానే కాదు.. ప్రస్తుతం గ్లోబల్ ను సైతం షేక్ చేస్తోంది.
మరోవైపు యంగ్ టైగర్ ఎన్టీఆర్ నటన సైతం ప్రపంచ వ్యాప్తంగా కీర్తిని సంపాదిస్తోంది. ఈ సీన్ తో ఎన్టీఆర్ కు వరల్డ్ వైడ్ దద్దరిల్లే రెస్పాన్స్ వస్తోంది. ఇప్పటికే ఎన్టీఆర్ అభిమానులు ఆల్ ఓవర్ ఇండియానే కాకుండా జపాన్, యూఎస్, తదితర దేశాల్లో ఉన్న విషయం తెలిసిందే. ప్రస్తుతం ఈ వీడియో క్లిప్ కు గ్లోబల్ నుంచి రెస్పాన్స్ దక్కడంతో ఫ్యాన్స్ ఖుషీ అవుతున్నారు. అలాగే దర్వకుడు రాజమౌళి (Rajamouli) ప్రతిభకూ ప్రశంసలు దక్కుతున్నాయి. వంద రోజల పాటు థియేట్రికల్ రన్ కొనసాగించిన ఈ మూవీ.. ప్రస్తుతం నెట్ ఫ్లిక్స్ లోనూ దూసుకెళ్తోంది.
ఇటు బాక్సాఫీస్ వద్ద కూడా రూ.1200 కోట్లకు పైగా వసూళ్లు రాబట్టి ‘ఆర్ఆర్ఆర్’ ప్రపంప వ్యాప్తంగా అత్యధిక వసూళ్లు రాబట్టిన నాల్గో ఇండియన్ ఫిల్మ్ గా గుర్తింపు పొందింది. బాలీవుడ్ బ్యూటీ అలియా భట్, అజయ్ దేవగన్, శ్రియా శరన్ ముఖ్య పాత్రల్లో నటించారు. డీవీవీ ఎంటర్ టైన్ మెంట్ బ్యానర్ పై నిర్మాత డీవీవీ దానయ్య రూ.550 కోట్లతో ఈ విజువల్ వండర్ నిర్మించారు. ప్రముఖ సంగీత దర్శకుడు ఎంఎం కీరవాణీ అద్భుతమైన మ్యూజిక్, బీజీఎంతో అదరగొట్టాడు. ప్రస్తుతం ఎన్టీఆర్ తన తదుపరి చిత్రాలైన ‘ఎన్టీఆర్ 30, ఎన్టీఆర్ 31’పై ఫోకస్ పెట్టారు.
