ఎన్టీఆర్ బయోపిక్ గురించి రోజుకో వార్త అభిమానులను కన్ఫ్యూజన్ కి గురి చేస్తోన్న సంగతి తెలిసిందే. దానికి తోడు చిత్ర యూనిట్ కూడా పలు రిలీజ్ తేదీలను వాయిదా వేయడం అనేక రూమర్స్ కి దారి తీస్తోంది. ఇక అన్ని పుకార్లకు చెక్ పెడుతూ బాలకృష్ణ టీమ్ స్పెషల్ ఎనౌన్స్ మెంట్ తో క్లారిటీ ఇచ్చేసింది. 

ట్రైలర్ లాంచ్ ను హైదరాబాద్ వేదికగా ఈ నెల 16న నిర్వహించనుండగా ఆడియో వేడుకను 21న గ్రాండ్ గా ఎన్టీఆర్ జన్మస్థలం నిమ్మకూరులో ప్లాన్ చేస్తున్నారు. ఇప్పటికే ముందస్తు సన్నాహకాల కోసం ప్లాన్ ను రెడీ చేసిన బాలకృష్ణ సినిమాకు హైప్ తేవడంలో ఏ మాత్రం స్లో అవ్వకూడదు అని నిర్ణయించుకున్నారు.

ఎమ్ఎమ్.కీరవాణి సంగీతం అందించిన ఈ సినిమాలోని రెండు పాటలకు ఇప్పటికే మంచి గుర్తింపు దక్కింది. ట్రైలర్ కూడా సినిమాపై అంచనాలు పెంచుతుందని చిత్ర యూనిట్ చెబుతోంది. వచ్చే ఏడాది జనవరిలోనే మొదటి పార్ట్ ను అలాగే సెకండ్ పార్ట్ ను రిలీజ్ చేయనున్న సంగతి తెలిసిందే. దర్శకుడు క్రిష్ మరికొన్ని రోజుల్లో షూటింగ్ పనులన్నిటినీ ఫినిష్ చేయనున్నట్లు ఇటీవల తెలియజేశారు.