ఎన్టీఆర్‌ చాలా సరదా మనిషి. ఆయన తన పంచ్ లతో, సరదా కబుర్లులో అందరినీ నవ్విస్తూంటారు. అందుకే ఆయన సెట్లో ఉంటే అసలు కష్టం తెలియదు, కాలం తెలియదు అంటూంటారు పనిచేసే డైరక్టర్, టెక్నికల్ టీమ్. అయితే ఆ విషయాలు అరుదుగా బయిటకు వస్తూంటాయి. తాజాగా ఆయన ఓ ఫొటో గ్రాఫర్ తో చేసిన ఫన్ ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అయ్యింది. 

వివరాల్లోకి వెళితే.. ఎన్టీఆర్ నటిస్తున్న సినిమా ‘ఆర్‌.ఆర్‌.ఆర్‌’ మహాబలేశ్వర్‌ షెడ్యూల్‌ పూర్తి చేసుకుంది.  రాజమౌళి, ఎన్టీఆర్‌తోపాటు చిత్ర  టీమ్ హైదరాబాద్‌కు చేరుకుంది. ఈ క్రమంలో విమానాశ్రయంలో తీసిన వీడియో, ఫొటోలు వైరల్‌గా మారాయి. అక్కడే ఉన్న ఫొటోగ్రాఫర్‌  ఎన్టీఆర్ ఫొటోలు గ్యాప్‌ లేకుండా క్లిక్‌ మనిపించారు. దీన్ని గమనించిన యంగ్‌టైగర్‌ ఆయనతో మాట్లాడారు. ‘పనిలేదా ఇంక.. ఎప్పుడూ ఇదే పనా నీకు..’ అని జోక్‌ చేశారు.  దీనికి అక్కడ ఉన్న ఫొటోగ్రాఫర్‌తోపాటు అందరూ నవ్వారు. అంతేకాదు ఎన్టీఆర్ కారువైపునకు నడుస్తూ.. ఫొటోగ్రాఫర్‌ను దగ్గరికి పిలిచి మాట్లాడారు. పొద్దున్నుంచి రాత్రి వరకు ఇక్కడేనా? అన్నారు. ఈ వీడియో సోషల్‌ మీడియాలో వైరల్‌గా మారింది. మీరూ ఆ వీడియోని ఇక్కడ చూడవచ్చు. 

‘ఆర్‌.ఆర్‌.ఆర్‌’లో కొమరం భీమ్‌గా తారక్‌, అల్లూరి సీతారామరాజుగా రామ్‌చరణ్‌ నటిస్తున్న సంగతి తెలిసిందే. అలియా భట్‌, ఒలీవియా మోరిస్  హీరోయిన్స్ గా నటిస్తున్నారు. శ్రియ, అజయ్‌ దేవగణ్‌, సముద్రఖని ముఖ్య పాత్రలు పోషిస్తున్నారు. డీవీవీ ఎంటర్‌టైన్‌మెంట్స్‌ పతాకంపై దానయ్య నిర్మిస్తున్నారు. పాన్‌ ఇండియా చిత్రంగా దాదాపు రూ.400 కోట్ల బడ్జెట్‌తో తీస్తున్న ఈ ప్రాజెక్టు వచ్చే ఏడాది ప్రేక్షకుల ముందుకు రాబోతోంది. ఇటీవల ఈ చిత్రం 50 రోజుల హైదరాబాద్‌ షెడ్యూల్‌ పూర్తి చేసుకుంది. 

 ఇటీవల హైదరాబాద్‌లో 50రోజుల భారీ యాక్షన్‌ సన్నివేశాలను షూటింగ్  పూర్తి చేసుకొని షెడ్యుల్‌కు ప్యాకప్‌ చెప్పింది. దీని తర్వాత రాజమౌళి టీమ్ మహారాష్ట్రలోని పుణెకు పయనమైంది. దానికి సమీపంలోని మహాబలేశ్వర్‌ అందమైన పరిసరాల్లో కొన్ని సీన్స్ షూట్ చేసారు.