ఆర్ ఆర్ ఆర్ సంచలనాలు కొనసాగుతున్నాయి. క్రిటిక్స్ ఛాయిస్ సూపర్ అవార్డ్స్ కి నామినేటైన ఎన్టీఆర్, చరణ్ హాలీవుడ్ స్టార్స్ తో తలపడుతున్నారు.
ఆర్ ఆర్ ఆర్ మూవీతో ఎన్టీఆర్, రామ్ చరణ్ ల ఫేమ్ మార్చేశారు రాజమౌళి. ప్రపంచ వేదికలపై సత్తా చాటుతున్న ఆర్ ఆర్ ఆర్ దర్శకుడు రాజమౌళితో పాటు ఇద్దరు హీరోల కీర్తి పతాక స్థాయికి తీసుకెళుతుంది. ఆర్ ఆర్ ఆర్ అనేక అరుదైన గౌరవాలు అందుకుంటుంది. ప్రతిష్టాత్మక గోల్డెన్ గ్లోబ్ అవార్డు గెలుచుకుంది. ఆస్కార్ బరిలో నిలిచింది. ఒరిజినల్ సాంగ్ విభాగంలో నామినేషన్ దక్కించుకున్న నాటు నాటు... ఆస్కార్ గెలుస్తుందని మేకర్స్ గట్టి విశ్వాసంతో ఉన్నారు.
తాజాగా మరో గొప్ప మైలురాయిని ఆర్ ఆర్ ఆర్ హీరోలు చేరుకున్నారు. క్రిటిక్స్ ఛాయిస్ సూపర్ అవార్డ్స్ కి ఎన్టీఆర్, రామ్ చరణ్ నామినేట్ అయ్యారు. హాలీవుడ్ సూపర్ స్టార్స్ టామ్ క్రూజ్, బ్రాడ్ ఫిట్, నికోలస్ కేజ్ లతో వీరిద్దరూ తలపడనున్నారు. బెస్ట్ యాక్టర్ ఇన్ యాక్షన్ మూవీస్ కేటగిరీలో ఎన్టీఆర్, చరణ్ లకు నామినేషన్స్ దక్కాయి. దీంతో హాలీవుడ్ దిగ్గజ నటుల సరసన వీరు నిలిచారు.
అలాగే ఆర్ ఆర్ ఆర్ మూవీ బెస్ట్ యాక్షన్ మూవీ కేటగిరీలో మరో నామినేషన్ పొందింది. మొత్తంగా క్రిటిక్స్ ఛాయిస్ సూపర్ అవార్డ్స్ నందు మూడు నామినేషన్స్ ఆర్ ఆర్ ఆర్ చిత్రానికి దక్కాయి. మార్చి 16న విన్నర్స్ ని ప్రకటించనున్నారు. 2020 లో క్రిటిక్స్ ఛాయిస్ అసోసియేషన్ ఈ అవార్డు ప్రకటించింది. 2021 నుండి ఇస్తున్నారు. ఇక మార్చి 12న ఆస్కార్ అవార్డ్స్ ప్రకటించనున్నారు.
కాగా ఎన్టీఆర్ ఆస్కార్ రెడ్ కార్పెట్ పై నడవనున్నారని సమాచారం. ఇక రామ్ చరణ్ గుడ్ మార్నింగ్ అమెరికా షోలో పాల్గొన్నారు. ఈ షోలో పాల్గొన్న మొదటి ఇండియన్ హీరోగా రామ్ చరణ్ గుర్తింపు పొందారు. ఒక్క సినిమాతో ఎన్టీఆర్, చరణ్ అరుదైన ఘనతలు సాధిస్తున్నారు.
