తారకరత్న ఆరోగ్యంపై ఒక్క మాట కూడా మాట్లాడని ఎన్టీఆర్, కళ్యాణ్ రామ్.. కారణం అదేనా? .. హాట్ టాపిక్
కళ్యాణ్ రామ్ నటించిన `అమిగోస్` ప్రీ రిలీజ్ ఈవెంట్ ఇటీవల హైదరాబాద్‌లో జరిగింది. దీనికి గెస్ట్ గా ఎన్టీఆర్ పాల్గొన్నారు. ఇందులో తారకరత్న ఆరోగ్యానికి సంబంధించి ఎలాంటి అప్‌డేట్ ఇవ్వకపోవడం చర్చనీయాంశం అవుతుంది.

నందమూరి తారకరత్న ఇటీవల అనారోగ్యానికి గురైన విషయం తెలిసిందే. నారా లోకేష్ పాదయాత్ర ప్రారంభించిన రోజే తారకరత్న గుండెపోటుకి గురయ్యారు. ఆ పాదయాత్రలోనే పడిపోయారు. హుటాహుటిన ఆయన్ని కుప్పం ఆసుపత్రికి తరలించగా, పరిస్థితి సీరియస్‌గా ఉందని వైద్యులు తెలిపారు. అత్యంత విషమంగా ఆయన ఆరోగ్యం ఉందని, వైద్యులు తమ శక్తిమేర పోరాడుతున్నారని అన్నారు. రెండు మూడు రోజుల అనంతరం ట్రీట్‌మెంట్ కి స్పందిస్తున్నారని, కదులుతున్నారని చెప్పారు. బెటర్ అవుతుందని వెల్లడించారు. అయినప్పటికీ పరిస్థితి క్రిటికల్ స్టేజ్‌లోనే ఉందన్నారు.
బాడీలో మల్టీపుల్ బ్లీడింగ్ జరుగుతుందని వైద్యులు తెలిపారు. తారకరత్నకి మెలెనా వ్యాధి ఉన్నట్టు భావించారు. అయితే ఆ తర్వాత నెమ్మదిగా కోలుకుంటున్నారని తెలిపారు. అయితే అన్న తారకరత్నని చూసేందుకు ఎన్టీఆర్‌తోపాటు కళ్యాణ్ రామ్ కూడా వెళ్లారు. బెంగుళూరు నారాయణ హృదయాలయలో తారకరత్నని బెడ్‌పై చూసి ఎన్టీఆర్ కన్నీళ్లు పెట్టుకున్నారు. ఆ విజువల్స్ బయటకు వచ్చాయి. అయితే ఆరోగ్యం బాగానే ఉందని, కోలుకుంటున్నారని చెప్పారు.
కానీ ఇటీల `అమిగోస్` ప్రీ రిలీజ్ ఈవెంట్‌లో మాత్రం తారకరత్న ఆరోగ్యంపై ఎన్టీఆర్ స్పందించడకపోవడం గమనార్హం. అభిమానులంతా అప్‌డేట్ ఆశించారు. తారకరత్న ఆరోగ్యంపై అప్‌డేట్ ఇస్తారని భావించారు, కానీ ఆ ప్రస్తావన లేకుండానే తన స్పీచ్‌ని ముగించాడు ఎన్టీఆర్. కళ్యాణ్ రామ్ కూడా ఆ మాట కూడా ఎత్తలేదు. దీంతో వారి అభిమానులు నిరాశ చెందారు. హాట్ టాపిక్ గా మారిన తారకరత్న ఆరోగ్యంపై అప్‌డేట్లు ఇవ్వకపోవడంతో వారు డిజప్పాయింట్ అవుతున్నారట. అయితే `అమిగోస్` సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్‌లో ఫ్యామిలీ ప్రస్తావన(తారకరత్న) తెస్తే అందరి మూడ్ డైవర్ట్ అవుతుందని, సినిమా గురించి చర్చ పక్కకెళ్తుందని దాని గురించి మాట్లాడలేదని సమాచారం.
అయితే ఇప్పుడు కొత్త చర్చ తెరపైకి వస్తుంది. తారకరత్న ఆరోగ్యంపై ఇప్పటి వరకు ఎలాంటి అప్‌డేట్లు లేవు. ఆసుపత్రి నుంచి ఎలాంటి ప్రెస్‌నోట్లు లేవు. ఆరోగ్యం ఎలా ఉందో కూడా బయటకు చెప్పడం లేదు. బయట రకరకాల పుకార్లు వినిపిస్తున్నాయి. షాకిచ్చే చర్చ నడుస్తుంది. ఈ నేపథ్యంలో నందమూరి హీరోలు దీనిపై స్పందించకపోవడం హాట్ టాపిక్ అవుతుంది. ఎన్టీఆర్ స్పందిస్తే బాగుండేదని అంటున్నారు. తారకరత్న ఆరోగ్యం ఇప్పుడు ఎలా ఉందనే దానికోసం ఫ్యాన్స్ ఈగర్‌గా వెయిట్ చేస్తున్నారు. మరి దీనిపై ఎప్పుడు క్లారిటీ వస్తుందో చూడాలి.