యంగ్ టైగర్ ఎన్టీఆర్ ఫోటో ఒకటి సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతుంది. సదరు ఫోటోలో ఓ పాపతో ఆయన ఆడుకుంటున్నారు. నెటిజెన్స్ ని ఆకర్షించిన ఈ ఫోటోపై ఆటో రామ్ ప్రసాద్ క్లారిటీ ఇచ్చాడు.
సెలబ్రెటీలకు సంబంధించిన ప్రతి చిన్న విషయం సెన్సేషనే. ఇక టాప్ స్టార్స్ సంగతి చెప్పాల్సిన పనిలేదు. తాజాగా ఎన్టీఆర్ ఫోటో ఒకటి సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. ఓ ఆరేడేళ్ల పాపతో ఎన్టీఆర్ ఆడుకుంటున్నారు. ఎన్టీఆర్, పాప నవ్వులు చిందిస్తున్న ఆ ఫోటో అద్భుతంగా ఉంది. దీంతో ఫ్యాన్స్ వైరల్ చేస్తున్నారు. అదే సమయంలో ఎన్టీఆర్ ఒడిలో ఉన్న ఆ అమ్మాయి ఎవరని ఆరా తీయడం మొదలుపెట్టారు.
దీనికి జబర్దస్త్ ఆటో రామ్ ప్రసాద్ క్లారిటీ ఇచ్చాడు. ఎన్టీఆర్ ఒడిలో ఉన్న పాప తన మేనకోడలు అని కామెంట్ చేశాడు. రామ్ ప్రసాద్ ట్వీట్ తో ఆ పాప ఎవరో తెలిసింది. ఎన్టీఆర్ ని కలిసి ఆ పాప లక్కీ అంటూ కొందరు కామెంట్స్ చేస్తున్నారు. ఎప్పుడు? ఏ సందర్భంలో కలిశారు అనేది రామ్ ప్రసాద్ వెల్లడించలేదు. ఇటీవల సైమా అవార్డ్స్ వేడుకల్లో పాల్గొన్న దుబాయ్ నుండి తిరిగి వచ్చారు. ఆర్ ఆర్ ఆర్ చిత్రంలో నటనకు గానూ ఎన్టీఆర్ ని సైమా వరించింది. బెస్ట్ యాక్టర్ విభాగంలో ఎన్టీఆర్ అవార్డు కైవసం చేసుకున్నాడు.
టాలీవుడ్ నుండి ఈ అవార్డు కోసం రామ్ చరణ్, అడివి శేష్, నిఖిల్, సిద్దూ జొన్నలగడ్డ, దుల్కర్ సల్మాన్ పోటీపడ్డారు. మరోవైపు ఎన్టీఆర్ దేవర షూటింగ్లో పాల్గొంటున్నారు. హైదరాబాద్ లో ఏకంగా బీచ్ సెట్ వేశారని సమాచారం. దేవర సాగర తీరం నేపథ్యంలో తెరకెక్కుతున్న చిత్రం. అధిక భాగం సముద్ర ప్రాంత సన్నివేశాలలో సినిమా కూడుకుని ఉంటుంది.
దేవర మూవీలో ఎన్టీఆర్ డ్యూయల్ రోల్ చేస్తున్నారని సమాచారం. ఈ క్రమంలో ప్రియమణి కూడా కీలక రోల్ చేస్తున్నారనే వార్తలు వినిపిస్తున్నాయి. ఇక హీరోయిన్ గా జాన్వీ కపూర్ నటిస్తుంది. సైఫ్ అలీ ఖాన్ ప్రధాన విలన్ పాత్రలో కనిపించనున్నారు. దేవర చిత్రానికి అనిరుధ్ సంగీతం అందిస్తున్నారు. 2024 ఏప్రిల్ 5న వరల్డ్ వైడ్ ఐదు భాషల్లో విడుదల కానుంది.
