కెరీర్ స్టార్టింగ్లో ఎక్కువగా రొటీన్ సినిమాలు మాత్రమే చేసిన ఎన్టీఆర్ ఈ మధ్య రూట్ మార్చి డిఫరెంట్ మూవీస్ చేస్తున్న తార‌క్ 


ఇప్పటికే బాబీ దర్శకత్వంలో సినిమా చేస్తున్నట్టుగా ప్రకటించిన ఎన్టీఆర్.. ఆ సినిమాతో త్రిపాత్రభినయం చేయనున్నాడు. అంతేకాదు వీటిలో ఒకటి పూర్తి నెగెటివ్ షేడ్స్ ఉన్న పాత్ర అన్న టాక్ వినిపిస్తోంది. ఎన్టీఆర్ తొలిసారిగా ప్రతినాయక పాత్రలో కనిపిస్తున్నాడన్న వార్త్ అభిమానులు ఖుషీ అవుతున్నారు. ఇప్పటికే నటుడిగా మంచి పేరు తెచ్చుకున్న ఎన్టీఆర్ ఈ విలన్ రోల్ లో మరోసారి ఆకట్టుకుంటాడన్న నమ్మకంతో ఉన్నారు.