ఏషియన్ సునీల్ తో కలిసి మహేష్ బాబు ఏఎంబీ థియేటర్ ను ఏర్పాటు చేసిన సంగతి తెలిసిందే. అయితే ఈ థియేటర్ జీఎస్టీ నిబంధనలను ఉల్లఘించిందని, ఆ కారణంగా అధికారులు థియేటర్ యాజమాన్యానికి నోటీసులు జారీ చేసిందని, కేసు నమోదు చేసే అవకాశం కూడా ఉందని వార్తలు వచ్చాయి.

ఈ వార్తలపై స్పందించిన ఏషియన్ సునీల్.. జీఎస్టీ తగ్గింపు విషయంలో ఏఎంబీ మల్టీప్లెక్స్ కు ఎలాంటి నోటీసులు ఇవ్వలేదని స్పష్టం చేశారు. అధికారులు థియేటర్ ని వచ్చిన మాట నిజమేనని, కానీ తాము జీఎస్టీ తగ్గించే టికెట్ లు విక్రయిస్తున్నామని, ఆ రికార్డులే అధికారులు అడిగితే వారికి ఇచ్చామని వివరించారు.

పెనాల్టీ కట్టాలని ఎలాంటి నోటీసులు అధికారులు ఇవ్వలేదని వెల్లడించారు. ఒకవేళ నోటీసులు ఇచ్చినా.. ఎంత కట్టాలని చెబుతారో అంత కట్టడానికి తాము సిద్ధంగా ఉన్నట్లు  తెలిపారు.

నోటీసులు ఇచ్చారనే వార్తలు తెలుసుకున్న అధికారులు కూడా ఆశ్చర్యపోయారని సునీల్ అన్నారు. ఏఎంబీ థియేటర్లు ఎలాంటి నిబంధనలను బ్రేక్ చేయవని, అధికారులు చెప్పినట్లే చేస్తామని స్పష్టం చేశారు. 

కొత్త థియేటర్ చిక్కులు: హీరో మహేష్ బాబుకు షోకాజ్ నోటీస్