Asianet News TeluguAsianet News Telugu

నయనతార భర్తకు నోటీసులు, విష్నేష్ శివన్ పై క్రిమినల్ చర్యలు తప్పవా..?

ఈమధ్య సినిమాలో వివాదాలకంటే.. సినిమా వాళ్ల వివాదాలు ఎక్కువైపోయాయి. ఇండస్ట్రీలో స్టార్లు ఏదో ఒక రకంగా వివాదాల్లో చిక్కుంటున్నారు. కేసులు, కోర్టులు చుట్టుతిరగడం బాగా ఎక్కువైపోయింది ఈరోజుల్లో. తాజాగా స్టార్ హీరోయిన్ నయనతార భర్త.. తమిళ దర్శకుడు విఘ్నేష్ కు నోటీసులు అందాయి. కారణం ఏంటంటే..? 
 

Notice To Director Vignesh Shivan To Remove His New Movie Title JMS
Author
First Published Jan 7, 2024, 11:13 AM IST

ఈమధ్య సినిమాలో వివాదాలకంటే.. సినిమా వాళ్ల వివాదాలు ఎక్కువైపోయాయి. ఇండస్ట్రీలో స్టార్లు ఏదో ఒక రకంగా వివాదాల్లో చిక్కుంటున్నారు. కేసులు, కోర్టులు చుట్టుతిరగడం బాగా ఎక్కువైపోయింది ఈరోజుల్లో. తాజాగా స్టార్ హీరోయిన్ నయనతార భర్త.. తమిళ దర్శకుడు విఘ్నేష్ కు నోటీసులు అందాయి. కారణం ఏంటంటే..? 

ప్రస్తుత పరిస్తితులో..వివాదం సినిమా ఒకే దగ్గర ఉంటున్నాయి. సినిమా తారలకు కేసులు, కోర్టులు చుట్టుతిరగడం బాగా ఎక్కువైపోయింది. ఎవరో ఒకరు.. ఏదో ఒకవివాదం రేపడం.. అందులో స్టార్స్ ఇరుక్కోవడం.. పరిపాటిగా మారింది. తాజాగా సౌత్  స్టార్ హీరోయిన్ నయనతార భర్త.. తమిళ దర్శకుడు విఘ్నేష్ కు నోటీసులు అందాయి. కారణం ఏంటంటే..?  సినిమా టైటిల్.. అవును.. ఈమధ్య సినిమా కథలు, పాటలు మాత్రమే కాదు.. టైటిల్స్ కూడా వివాదం అవుతున్నాయి.  నయనతార భర్త విఘ్నేశ్‌ శివన్‌ కొత్త సినిమా  టైటిల్‌ పెద్ద వివాదానికి దారి తీసింది. 

విఘ్నేశ్‌ శివన్‌ దర్శకత్వంలో లవ్‌ టుడే ఫేమ్‌ హీరో ప్రదీప్‌ రంగనాథన్‌ హీరోగా సినిమా తెరకెక్కుతోంది. అయితే  ఈ సినిమాకు ఎల్ ఐ సీ అనే టైటిల్ ను అనౌన్స్ చేశారు సినిమా టీమ్.. ఇంతకీ  ఎల్‌ఐసీ అంటే ఏంటా అనేకదా డౌట్. లవన్‌ ఇన్సూరెన్స్ కార్పొరేషన్‌ అని అర్ధం. ఇక ఈ టైటిల్  కన్ఫామ్‌ చేయడంతోనే అసలు సమస్య ఇక్కడే మొదలైంది.  ఈ టైటిల్ తో హార్ట్ అయిన ఎల్ ఐసీ కంపెనీ.. అంటే .. లైఫ్‌ ఇన్సూరెన్స్‌ కార్పొరేషన్‌ ఆఫ్ ఇండియా వారు సినిమా టీమ్ పై ఆగ్రహం వ్యక్తం చేయడంతో పాటు  నోటీసులు జారీ చేసింది. 

ప్రజల్లో మంచి పేరు ఉన్న సంస్థను, ఇలా సినిమాల కోసం ఉపయోగిస్తే సంస్థ ప్రతిష్టకు భంగం కలుగుతుందని ఆరోపిస్తూ నోటీసులు జారీ చేసింది. వారంలోగా సినిమా టైటిల్‌ మార్చకపోతే క్రిమినల్ చర్యలు తీసుకుంటామని హెచ్చరించింది. అయితే ఈ వివాదంపై ఇంత వరకూ మూవీ టీమ్ స్పందించలేదు. దర్శకుడు నిర్మాత అయిన విష్నేష్ కూడా స్పందించాల్సి ఉంది. మరి వారు ఏం చేస్తారు అన్నది సస్సెన్స్ గా మారింది. 

ఇక దర్శకుడిగా విష్నేష్ శివన్ విజయప్రస్తానం కొనసాగిస్తున్నారు.  కాతు వాక్కుల రెండు కాదల్‌ సినిమాతో భారీ విజయాన్ని అందుకున్న విఘ్నేశ్‌ కొంచెం గ్యాప్ తర్వాత ఈ సినిమాను తెరకెక్కిస్తున్నారు. నయనతారను పెళ్లాడి.. ఇద్దరు పిల్లలతో హ్యాపీగా లైఫ్ ను లీడ్ చేస్తున్నాడు యంగ్ డైరెక్టర్. ఇక ఆయన తెరకెక్కించిన కాతు వాక్కులలో సమంత, నయనతార హీరోయిన్‌లుగా నటించగా విజయ్‌సేతుపతి హీరోగా నటించారు. ఇక ఎల్‌ఐసీ చిత్రాన్ని పూర్తి లవ్‌ అండ్‌ ఎంటర్‌టైనర్‌గా తెరకెక్కిస్తున్నారు. లవ్‌ టుడేతో తెలుగులోనూ మంచి గుర్తింపు సంపాదించుకున్న ప్రదీప్‌ రంగనాథన్‌కు జోడిగా ఈ సినిమాలో కృతి శెట్టి నటిస్తోంది.

Latest Videos
Follow Us:
Download App:
  • android
  • ios