రెచ్చిపోకండి సామీ...రష్మిక కాదు

రామ్ చరణ్ ఓ కీలక పాత్రలో నటిస్తున్న సంగతి తెలిసిందే.. చిరు ప్లాష్ బ్యాక్ ఎపిసోడ్ లో చరణ్ పాత్ర ఉంటుందట.. కథను మలుపు తిప్పేలా ఈ పాత్ర ఉండబోతుందట.. అయితే ఇందులో ఆ పాత్రకి జోడి కూడా ఉంటుందని, ఆ పాత్రని కన్నడ భామ రష్మిక మందన్నా చేయనుందని జోరుగా ప్రచారం జరుగుతోంది.. ఇప్పటికే కొరటాల ఆమెను ఫిక్స్ చేశారని సమాచారం.. కానీ దీనిపైన ఎలాంటి అధికార ప్రకటన లేదు.. 

Not Rashmika, Bollywood actress for Ram Charan? jsp

గత రెండు రోజులుగా ఆచార్య చిత్రంలో రామ్ చరణ్ సరసన రష్మిక నటించనుందంటూ వార్తలువస్తున్న సంగతి తెలిసిందే. ముఖ్యంగా సోషల్ మీడియాలో రామ్ చరణ్ , రష్మికను ఫొటో షాప్ లో యాడ్ చేసి పోస్ట్ లు పెడుతున్నారు. వెబ్ మీడియా సంగతైతే చెప్పక్కర్లేదు. యూట్యూబ్ లో వీడియోలు ఈ కాంబినేషన్ పై కుప్పలు తెప్పలుగా వచ్చేస్తున్నాయి. కానీ ఆచార్య టీమ్ నుంచి అందుతున్న సమాచారం మేరకు ఇప్పటివరకూ ఏ హీరోయిన్ ని రామ్ చరణ్ సరసన ఫైనలైజ్ చేయలేదు. ఎంపిక చేయలేదు. 

రామ్ చరణ్ మీద షూట్ చేసే సీన్స్ పిబ్రవరి లేదా మార్చి లో మొదలు కానున్నాయి. కాబట్టి ఆ విషయంలో టీమ్ కంగారుపడటం లేదు. కూల్ గా ఓ బాలీవుడ్ హీరోయిన్ ని తీసుకుని వచ్చి చరణ్ ప్రక్కన నటింపచేస్తే నార్త్ ఇండియా మార్కెట్లో కూడా సినిమాని మంచి రేటుకు అమ్మవచ్చు అనే ఆలోచనలతో నిర్మాతలు ఉన్నారట. దానికి తోడు ఆర్ ఆర్ ఆర్ తో నార్త్ లో క్రేజ్ తెచ్చుకునే రామ్ చరణ్ తమ సినిమా బిజినెస్ కు బాగా ఉపయోగపడతారని భావిస్తున్నారు.

 ఇక ఈ సినిమాలో రామ్ చరణ్ పాత్ర కీలకం కానుంది.  చిరు ప్లాష్ బ్యాక్ ఎపిసోడ్ లో చరణ్ పాత్ర ఉంటుందట.. కథను మలుపు తిప్పేలా ఈ పాత్ర ఉండబోతుందట. ఈ సినిమాని వచ్చే ఏడాది సంక్రాంతికి విడుదల చేసేందుకు సన్నాహాలు చేస్తున్నారు.. దేవాదాయ ధర్మాదాయ శాఖలో జరిగే అక్రమాల చుట్టూ ఈ కథ తిరుగుతుందని తెలుస్తోంది.

ఇది ఇలా ఉంటే ప్రస్తుతం రామ్ చరణ్ ,రాజమౌళి దర్శకత్వం వహిస్తున్న RRR షూటింగ్ లో బిజీగా ఉన్నాడు.. ఇందులో ఎన్టీఆర్ మరో హీరోగా నటిస్తున్నాడు.. ఈ సినిమాని భారీ బడ్జెట్ తో డివివి దానయ్య నిర్మిస్తున్నారు. ఎన్టీఆర్ సరసన హాలీవుడ్ భామ ఒలీవియా మోరిస్ నటిస్తుండగా, చరణ్ సరసన అలియా భట్ నటిస్తోంది. పిరియాడిక్ యాక్షన్ డ్రామాగా తెరకెక్కుతున్న ఈ సినిమాని 2021 జనవరి 8న రిలీజ్ చేయనున్నారు

Latest Videos
Follow Us:
Download App:
  • android
  • ios