యుఎస్ డల్లాస్ లో జరిగిన ఈవెంట్ కి నోరా ఫతేహి, అక్షయ్ కుమార్ హాజరయ్యారు. వేదికపై వీరిద్దరూ ఊ అంటావా మావ పాటకి తమ శైలిలో చిందేశారు.
ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ నటించిన పుష్ప చిత్రం ఇండియా మొత్తం ఎంతటి సెన్సేషన్ క్రియేట్ చేసిందో తెలిసిందే. ఈ చిత్రంలోని పాటలకి అంతర్జాతీయ సెలెబ్రిటీలు కూడా ఫిదా అయ్యారు. ఈ చిత్రంలో సమంత చేసిన స్పెషల్ సాంగ్ 'ఊ అంటావా మావ' మాస్ ఆడియన్స్ ని ఉర్రూతలూగించింది. థియేటర్స్ మోతెక్కేవిధంగా సమంత, అల్లు అర్జున్ ఈ సాంగ్ లో డాన్స్ పెర్ఫామెన్స్ చేశారు.
ఈ సాంగ్ లో అల్లు అర్జున్ స్టైల్, సమంత హావభావాలు యువతని పిచ్చెక్కించాయి. బాలీవుడ్ స్టార్స్ కూడా ఈ పాటకి తరచుగా చిందేయడం చూస్తూనే ఉన్నాం. తాజాగా బాలీవుడ్ స్టార్ హీరో అక్షయ్ కుమార్, ఐటెం బాంబ్ నోరా ఫతేహి ఊ అంటావా మావ అంటూ రెచ్చిపోయారు.
యుఎస్ డల్లాస్ లో జరిగిన ఈవెంట్ కి నోరా ఫతేహి, అక్షయ్ కుమార్ హాజరయ్యారు. వేదికపై వీరిద్దరూ ఊ అంటావా మావ పాటకి తమ శైలిలో చిందేశారు. అక్షయ్ కుమార్ తన స్టైల్ ఫాలో కాగా.. నోరా ఫతేహి తన గ్లామర్ ప్రదర్శిస్తూ ఉడికించి స్టెప్పులతో అదరగొట్టింది. అయితే ఆమె హావ భావాలూ మాత్రం చాలా దారుణంగా ఉన్నాయి.
పాటకి సంబంధం లేనివిధంగా ఎక్స్ ప్రెషన్స్ ఇవ్వడంతో నోరా ఫతేహిపై ట్రోలింగ్ జరుగుగుతోంది. కొంతమందికి వీరి డ్యాన్స్ కూడా నచ్చలేదు. ఈ వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైల్డ్ ఫైర్ లాగా వ్యాపిస్తోంది. మాస్ ఐటెం సాంగ్ ని ఇలా నాశనం చేశారు ఏంటి అంటూ నెటిజన్లు కామెంట్స్ పెడుతున్నారు.
సమంత, అల్లు అర్జున్ డ్యాన్స్ గ్రేస్ ని మ్యాచ్ చేయడం మీ వల్ల కాదు అని కామెంట్స్ చేస్తున్నారు. సమంత లాగా హావభావాలు పలికించాలంటే నోరా ఫతేహికి సాధ్యం కాదు. ఆమె మంచి డ్యాన్సర్ కావచ్చు.. కానీ పాటకి తగ్గట్లుగా మూమెంట్స్ ఇవ్వడం, ముఖంలో హావభావాలు పలికించడం సమంత తర్వాతే ఎవరైనా అని కామెంట్స్ చేస్తున్నారు. పుష్ప చిత్రం కోసం సమంత తన కెరీర్ లో తొలిసారి ఐటెం సాంగ్ లో చిందేసింది.
