ఐదేళ్ల క్రితం సంచలనం సృష్టించిన మలయాళ హీరోయిన్ లైంగిక వేధింపుల కేసులో.. మలయాళ స్టార్ హీరో దిలీప్ పై నాన్ బెయిలబుల్ కేసు నమోదు అయినటట్టు తెలుస్తోంది.  

ఐదేళ్ల క్రితం సంచలనం సృష్టించిన మలయాళ హీరోయిన్ లైంగిక వేధింపుల కేసులో.. మలయాళ స్టార్ హీరో దిలీప్ పైఇప్పుడు నాన్ బెయిలబుల్ కేసు నమోదు అయినట్టు తెలుస్తోంది.

Add Asianetnews Telugu as a Preferred SourcegooglePreferred

2017 లో మలయాళ ఫిల్మ్ ఇండస్ట్రీలో జరిగిన ఇష్యూ దేశం అంతా సంచలనంగా మారింది. మలయాళ స్టార్ హీరో దిలీప్.. ఫేమస్ మలయాళ నటి పై మనుషులను పెట్టించి మరీ లైంగికంగా వేధించారణి ఆరోపణలు వచ్చాయి. సదరు నటిని కారులో తిప్పుతూ.. లైంగిక వేధింపులకు గురి చేసి దూరంగా వదిలిపెట్టడం అప్పట్లో సంచలనంగా మారింది. ఆతరువాత ఆకేసులో యాక్టర్ దిలీప్ ను 2017 లో అరెస్ట్ కూడా చేశారు. కొద్ది రోజులకు బెయిల్ పై వచ్చిన ఆయన.. తరువాత నుంచి సిమాలు చేసుకుంటూనే ఉన్నారు.

2017 నుంచి దిలీప్ పై కోర్ట్ కేసు నడుస్తున్నా.. ఇంత వరకూ తీర్పు రాకపోవడం చాలా అనుమానాలకు దారి తీసింది. ఐదేళ్ళు గడుస్తున్నా.. ఇంత వరకూ దిలీప్ పై ఎటువంటి యాక్షన్ తీసుకోలేదు. ఇక సదరు నటి కూడా ఆతరువాత పెళ్ళి చేసుకుని.. భర్తతో హ్యాపీగానే ఉంటుంది. ఇక అంతా సర్ధుమనిగింది అనుకుంటున్న టైమ్ లో రీసెంట్ గా మళ్ళీ ఈ కేసు తెరపైకి వచ్చింది.

ఈ ఇష్యూలో తనకు ఇంకా న్యాయం జరగలేదు అంటూ.. వేధింపులకు గురైన నటి రీసెంట్ గా బయటకు వచ్చారు. తనకు ఇంకా న్యాయం జరగలేదంటూ.. సీఎం కు లేఖ రాశారు ఆమె. మీరే న్యాయం చేయాలంటు వేడుకున్నారు. ఆతరువాత జరిగిన కొన్ని పరిణామాల తొ.. ఈ కేస్ మళ్ళీ యాక్టీవ్ అయినట్టు తెలుస్తుంది. అంతే కాదు.. దిలీప్ పై నాన్ బెయిలబుల్ కేస్ కూడా నమోదు చేసినట్టు సమాచారం. దిలీప్ తో పాటు ఆయన తమ్ముడు,భావ, మరికొంత మంది కుటుంబ సభ్యులపై కూడా కేసు నమోదు అయినట్టు తెలుస్తోంది.

అపట్లో వేధిపులకు గురైన నటికి మలాయళంతో పాటు దేశవ్యాప్తంగా నటులు సపోర్ట్ గా నిలిచారు. దిలీప్ కు శిక్ష పడుతుంది అని అందరూ భావించారు. కాని అనుకున్నది జరగలేదు. ఇప్పుడు మళ్లీ ఐదేళ్ళ తరువాత ఈ కేసు తెరపైకి వచ్చింది. ఈ లోపు పరిణామాలు చాలా మారిపోయాయి. ఇప్పుడు ఎవరికి ఎవరి సపోర్ట్ ఉంటుందో చూడాలి. ఇంకా ఈ కేసు ఎన్ని మలుపులు తిరుగుతుందో చూడాలి.

Also Read :Salman Khan New Movie : 3 పాత్రలు.. 10 మంది హీరోయిన్లు.. రచ్చ చేయబోతున్న సల్మాన్ ఖాన్