బోయపాటి శ్రీను తో జయ జానకి నాయక, నాగచైతన్యతో సాహసం శ్వాసగా సాగిపో వంటి సినిమాలు నిర్మించిన నిర్మాత మిర్యాల రవీవందర్ రెడ్డి. ప్రస్తుతం ఆయన బోయపాటి,బాలయ్య కాంబినేషన్ లో సినిమా చేస్తున్నారు. ఆయన పై..ప్రతిపాడులోని మేజిస్ట్రేట్ కోర్టు నాన్ బెయిలబుల్ వారెంట్ (ఎన్‌బిడబ్ల్యు) ఇష్యూ అయింది. రవీందర్ రెడ్డి  వల్ల నష్టపోయిన  ఓ డిస్ట్రిబ్యూటర్ ఈ కేసు పెట్టాడు. ఆరేళ్ల కింది కేసు ఇప్పుడు చివరి దశకు వచ్చింది. ఇందులో వాదోపవాదాలు విన్న కోర్టు అతడికి నాన్ బెయిలబుల్ వారెంట్ జారీ చేసింది. 

మిర్యాల రవీందర్ రెడ్డి యుస్ బేసెడ్ డిస్ట్రిబ్యూటర్ నుంచి సాహసం శ్వాసగా సాగిపో చిత్రం నిమిత్రం యాభై లక్షలు అడ్వాన్స్ గా తీసుకున్నారు. అయితే ఆ ఎగ్రిమెంట్, కమిట్మెంట్ ని ఖాతరు చేయకుండా వేరే వారికి రైట్స్ అమ్మేసారు. డిస్ట్రిబ్యూటర్ నుంచి తీసుకున్న మొత్తం వెనక్కి ఇవ్వకుండా పది లక్షలు మాత్రమే ఇస్తానంటున్నారు.  దాంతో సదరు డిస్ట్రిబ్యూటర్ కేసు వేయటం జరిగింది. 
 
ప్రస్తుతం మిర్యాల రవీందర్ రెడ్డి ప్రస్తుతం బోయపాటి శ్రీను దర్శకత్వంలో నందమూరి బాలకృష్ణతో ఓ సినిమా నిర్మిస్తున్నాడు. 'సింహా', 'లెజెండ్` వంటి బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్ హిట్స్ త‌ర్వాత‌ నటసింహ నందమూరి బాలకృష్ణ, మాస్ డైరెక్టర్ బోయపాటి శ్రీనుల మ్యాసివ్ బ్లాక్‌బ‌స్ట‌ర్ కాంబినేష‌న్‌లో రూపొందుతోన్న‌ హ్యాట్రిక్ మూవీ BB3. మిర్యాల స‌త్య‌నారాయ‌ణ రెడ్డి స‌మ‌ర్ప‌ణ‌లోద్వారకా క్రియేషన్స్ ప‌తాకంపై  ప్రొడ్యూస‌ర్‌ మిర్యాల రవీందర్ రెడ్డి ఈ చిత్రాన్ని అత్యంత ప్రెస్టీజియస్‌గా నిర్మిస్తున్నారు. 

ఇప్ప‌టికే ఈ మూవీ నుండి నటసింహ నందమూరి బాలకృష్ణ పుట్టిన‌రోజు కానుక‌గా రిలీజ్ చేసిన BB3 First Roar టీజ‌ర్‌కి ట్రెమండ‌స్ రెస్పాన్స్ వ‌చ్చింది. ఈ చిత్రాన్ని మే28న ప్ర‌పంచ‌వ్యాప్తంగా విడుద‌ల‌చేయ‌నున్న‌ట్లు అధికారికంగా ప్ర‌క‌టిస్తూ స్పెష‌ల్ పోస్ట‌ర్‌ని రిలీజ్ చేశారు మేక‌ర్స్. 

నటసింహ నందమూరి బాలకృష్ణ, ప్ర‌గ్యా జైస్వాల్‌తో పాటు భారీతారాగ‌ణం న‌టిస్తున్న‌ ఈ చిత్రానికి సినిమాటోగ్రఫీ: సి. రాంప్రసాద్‌, సంగీతం: త‌మన్‌ ఎస్‌‌‌, మాటలు: ఎం.రత్నం, ఆర్ట్‌ డైరెక్టర్‌: ఎ.ఎస్‌.ప్రకాష్‌, ఎడిటింగ్‌: కోటగిరి వేంకటేశ్వరరావు, తమ్మిరాజు, ఫైట్స్‌: రామ్‌-ల‌క్ష్మ‌ణ్‌, స‌మ‌ర్ప‌ణ‌: మిర్యాల స‌త్య‌నారాయ‌ణ రెడ్డి, నిర్మాత: మిర్యాల రవీందర్‌రెడ్డి, దర్శకత్వం: బోయపాటి శ్రీను.