Bigg Boss Telugu 7: సీరియల్స్ బ్యాచ్ మధ్య నామినేషన్ చిచ్చు.. శివాజీకి కౌంటర్ల మీద కౌంటర్లు..
ఎప్పుడూ యూనిటీగా ఉండే సీరియల్స్ బ్యాచ్ ప్రియాంక, శోభా శెట్టి, అమర్ దీప్‌ల మధ్య ఈ సారి నామినేషన్ ప్రక్రియ చిచ్చు పెట్టిందని ప్రోమో చూస్తుంటే అర్థమవుతుంది. ఫన్నీగా ప్రారంభమైన నామినేషన్లు, హాట్ హాట్‌గా సాగడం విశేషం.

బిగ్ బాస్ తెలుగు 7 ఎనిమిదో వారంలో సందీప్ ఎలిమినేట్ అయ్యాడు. ఇప్పుడు మళ్లీ ఆట మొదలైంది. ఈ వారం బిగ్ బాస్ హౌజ్‌ని వీడేది ఎవరనే దానికి నామినేషన్ల ప్రక్రియ ప్రారంభమైంది. సోమవారం ఎపిసోడ్‌కి సంబంధించి విడుదలైన ప్రోమోలు ఆసక్తిని రేకెత్తిస్తున్నాయి. తాజా ప్రమోలో నామినేషన్ల ప్రక్రియ ఫన్నీగా, అదే సమయంలో వేడి వేడిగా సాగింది.
మొదట అర్జున్.. ఇప్పటి వరకు నామినేషన్లలో లేడని చెప్పి నామినేట్ చేశాడు తేజ, సేఫ్ గేమ్ ఆడుతున్నాడని అర్జున్ కామెంట్ చేయడం, ఏ ఊర్లో సేఫ్ గేమ్ అయ్యా ఇది అని తేజ అనడం ఆద్యంతం నవ్వులు పూయించాయి. ఇక శివాజీ.. తేజని నామినేట్ చేయగా, ఆ రోజు వాడిని నామినేట్ చేయకపోయింటే, ఈ రోజు వాడు ఇక్కడ ఉండేవాడేమో అనిపిస్తుందని శివాజీ చెప్పగా, అది మీరు కూడా అన్నారు, నామినేషన్ చేసినంత మాత్రాన ఎలిమినేషన్ కాదని అని తేజ కౌంటరిచ్చాడు.
రతిక.. శోభా శెట్టిని నామినేట్ చేసింది. పౌల్ గేమ్ ఆడిందని ఆరోపించింది. దానికి అమర్ దీప్‌ని శోభ క్లారిటీ అడగ్గా, రతిక చెప్పింది కానీ నేను తీసుకోలేదని అమర్ దీప్ చెప్పాడు.నేను నీకు చెప్పినా అని అంటున్నావని రతిక సైలెంట్ అయిపోయింది. ఫస్ట్ రెండు వారాల్లో ఏ రతిక అయితే ఉందో, ఆ రతికని చూడాలని నామినేట్ చేస్తున్నానని తేజ, చెప్పగా, సెపరేట్ టీవీ పెట్టుకుని చూస్తావా? అని రతిక రియాక్ట్ కావడం ఆశ్చర్యపరిచింది.
ఇక భోలే.. అమర్ దీప్‌ని నామినేట్ చేస్తూ, నన్ను టార్గెట్ చేశావు, నేను మాట్లాడితే కుర్చీని భమ్ అని తన్నావ్.. ఒక్క రీ రికార్డింగే లేదక్కడ అని అనగా, అమర్ దీప్ నవ్వడం విశేషం. అనంతరం నీ నామినేషన్ నా మీద ఎంత అగ్రెసివ్‌గా ఉందో తెలుసా? అని భోలే అనగా, ఎవరి దగ్గర తప్పు ఒప్పుకున్నానో చెప్పు అంటూ అమర్ దీప్‌ఫైర్ అయ్యాడు. నీకున్నంత రివేంజ్ టాస్క్ లు మాకు తెలియవయ్యా.. అంటూ శివాజీని ఉద్దేశించి కామెంట్ చేశాడు అమర్ దీప్. దీనికి శివాజీ రియాక్ట్ అవుతూ, అన్నీ డబుల్ మీనింగ్ లు మాట్లాడుతావనగా, మీకు దెండం సామీ అంటూ చేతులెత్తి దెండం పెడుతూ, చెప్పందయ్య సామీ.. ఏం చెబుతావో నీకే అర్థం కాదంటూ కామెంట్ చేయగా, శివాజీ గెడ్డం గోక్కోవడం విశేషం.
శోభా శెట్టి చెప్పినడానికి ఏ పాయింట్ మాట్లాడుతున్నావ్, నాకు నవ్వొస్తుందని ప్రియాంక చెప్పింది. అనంతరం.. మీరు గ్రూపులుగా ఆడుతున్నారని రతిక చెప్పగా, గ్రూప్ కాదు రతిక, ఇది సింగిల్ అంటూ ఫైర్ అయ్యింది ప్రియాంక. మరోవైపు ప్రియాంక, అమర్ దీప్‌ల మధ్య కూడా గొడవ జరిగింది. అమర్ దీప్‌ని నామినేట్ చేసే క్రమంలో కోపం వచ్చినప్పుడు ఏది పడితే అది మాట్లాడతావా? అనగా, అవును మాట్లాడతాను తప్పా అని అమర్ దీప్ అన్నాడు. అది బూతు మాట్లాడటం తప్పు అని ప్రియాంక చెప్పింది. అది బూతు కాదని వాదించాడు అమర్ దీప్. అంతేకాదు ఒక్కడు దొరికితే చాలు ఎగరేస్తారని, ఎగరేయండి, ఏదో వీళ్లొచ్చి నన్ను ఉద్దరించినట్టు అంటూ ఆయన మండిపడటం ఆద్యంతం ఆసక్తికరంగా మారింది.
అయితే ఎప్పుడూ యూనిటీగా ఉండే సీరియల్స్ బ్యాచ్ ప్రియాంక, శోభా శెట్టి, అమర్ దీప్‌ల మధ్య ఈ సారి నామినేషన్ ప్రక్రియ చిచ్చు పెట్టిందని ప్రోమో చూస్తుంటే అర్థమవుతుంది. ఫన్నీగా ప్రారంభమైన నామినేషన్లు, హాట్ హాట్‌గా సాగడం విశేషం. ఇక ఈ వారం నామినేషన్‌లో రతిక, ప్రియాంక, అమర్ దీప్, తేజ, శోభా శెట్టి, అర్జున్, యావర్, భోలే ఈ వారం నామినేషన్‌లో ఉన్నట్టు తెలుస్తుంది. ఈ వారంలో శివాజీ, గౌతమ్, ప్రశాంత్, అశ్విని నామినేషన్లలో లేరని తెలుస్తుంది.