బిగ్‌బాస్‌4ని ఎప్పుడూ లేని విధంగా ఈ సారి ఆరోగ్య సమస్యలు వెంటాడుతున్నాయి. ఇప్పటికే గంగవ్వ అనారోగ్య సమస్యలతో అర్థంతరంగానే హౌజ్‌ నుంచి బయటకు వెళ్ళిపోయింది. ఫస్ట్ టైమ్‌ ఓ వృద్ధురాలిని కంటెస్టెంట్ గా ఎంపిక చేసి సరికొత్త ట్రెండ్‌కి తెరలేపిన `బిగ్‌బాస్‌4` ఆ తర్వాత అదే చర్చనీయాంశంగా మారింది. తనకు ఆరోగ్యం సహకరించడం లేదంటూ గంగవ్వ తప్పుకున్న విషయం తెలిసిందే. 

ఆ మధ్య అవినాష్‌ సైతం ఫిజికల్‌ టాస్క్ లో భాగంగా కాలు బెనికి గాయపడ్డాడు. రెండుమూడు రోజుల్లో కోలుకున్నారు. ఇప్పుడు నోయల్‌ వంతు వచ్చింది. తాజాగా నోయల్‌ అనారోగ్యానికి గురయ్యాడు. తనకి అనారోగ్య సమస్య తీవ్రమయినట్టు తెలుస్తుంది. నిజానికి బిగ్‌బాస్‌4లో నోయల్‌ స్ట్రాంగ్‌ కంటెస్టెంట్‌గా ఉన్నాడు. హౌజ్‌లో అందరిచేత పెద్దన్న పాత్రని పోషిస్తున్నాడు. పాజిటివ్‌ ఫీడ్‌ బ్యాక్‌ని పొందాడు. 

తన గేమ్‌ కూడా చాలా స్టడీగా సాగుతుంది. అయితే గత రెండుమూడు రోజులుగా నోయల్ కాస్త డల్‌ అయిపోయాడు. బుధవారం గేమ్‌లో పూర్తిగా ఆయన బెడ్‌ రెస్ట్ కే పరిమితమయ్యాడు. దానికి కారణంగా ఆయన దీర్ఘకాలిక వ్యాధితో బాధపడుతుండటమే. ఆర్థరైటిస్ వ్యాధితో  నోయల్‌ బాధపడుతున్నట్టు తెలుస్తుంది. ఇది దీర్ఘకాలిక వ్యాధి. ఎక్కువగా కీళ్లను ప్రభావితం చేస్తుంది. చల్లటి ప్రదేశంలో ఉంటే కీళ్లు వాపు, కీళ్ళ దృఢత్వం లేకపోవడం, జాయింట్ ఫంక్షన్ లోపించడం లాంటివి ఎక్కువగా ఉంటాయి. బిగ్‌బాస్‌4లో అంతా ఏసీ ఉంటుంది. దీని వల్ల ఆయనకు ఈ వ్యాధి తీవ్రత ఎక్కువైతే మణికట్టు, మోకాలు, చీలమండలు, మోచేతులు, భుజాలు బాగా పెయిన్‌ వస్తున్నట్టు తెలుస్తుంది. 

ఇదే విషయాన్ని నోయల్‌ చెప్పాడు. తనకు మోనాలు, భుజం, కీళ్లు బాగా నొప్పిగా ఉన్నాయని, బిగ్‌బాస్‌కి చెప్పానని, తాను డాక్టర్‌ని పిలిపించారని తెలిపారు. అయితే బిగ్ బాస్ హౌస్‌కి వెళ్లిన తర్వాత వాతావరణంతో పాటు ఆహార మార్పుల వల్ల నోయల్ బాగా ఇబ్బంది పడుతూ కనిపిస్తున్నాడు. కీళ్ల వాపుతో సరిగా నడవలేకపోతున్నాడు. ఈ వ్యాధి తీవ్రత ఎక్కువ కావడంతో బీబీ డే కేర్ టాస్క్ నుంచి కూడా నిష్క్రమించాడు నోయల్. బిగ్‌బాస్‌ కోరిక మేరకు విశ్రాంతి తీసుకుంటున్నారు. 

నోయల్‌కి హెల్త్ ఇష్యూస్ ఉండటం వల్ల ఫిజికల్ టాస్క్‌లో సరిగా పార్టిసిపేట్ చేయలేకపోతున్నాడు. ఆరోగ్యం సహకరించకపోవడంతో గంగవ్వను పంపించినట్టే తనని కూడా హౌస్ నుంచి బయటకు పంపించమని బిగ్ బాస్ వాళ్లకి చెప్పినట్టుగా అన్ సీన్ వీడియోలో తెలియజేశాడు నోయల్. మరి నిజంగానే హౌజ్‌ నుంచి వెళ్లిపోతాడా? కోలుకుని గేమ్‌ ఆడతాడా? అన్నది చూడాలి. 

ఇదిలా ఉంటే ప్రతిదీ వేదాంతం మాట్లాడుతూ, అందరిచేత మంచి పేరుతెచ్చుకున్న నోయల్‌ నిజస్వరూపం చూపించడం లేదనే విమర్శలు వస్తున్నాయి. సింపతితో లాక్కొస్తున్నారని అంటున్నారు. నాగార్జున కూడా అసలైన నోయల్‌ బయటకు రావడం లేదని అన్నారు. మరి అసలు నోయల్‌ని చూపిస్తాడా? లేదా? అన్నది చూడాలి.