బిగ్ బాస్ హౌస్ ప్రవేశించిన ఇంటి సభ్యులు ప్రతి ఒక్కరు సేఫ్ గేమ్ ఆడాలని అనుకుంటారు. హౌస్ మేట్స్ తో పాటు ప్రేక్షకులు హర్ట్ కాకుండా తమ ప్రవర్తన ఉంటే ఎక్కువ కాలం హౌస్ లో ఉండవచ్చనే ఆలోచన ప్రతి ఒక్కరికీ ఉంటుంది. ఐతే బిగ్ బాస్ టాస్క్ లు ఇంటి సభ్యులలో ఒకరిపై మరొకరికి ద్వేషం కలిగేలా చేస్తాయి. తప్పక అనేక సార్లు ఒకరితో మరొకరు గొడవపడే సంధర్భం ఏర్పడుతూ ఉంటుంది. ఐతే కొందరు మాత్రం కర్ర ఇరగకూడదు, పాము చావకూడదు అనే తీరున వ్యవహరిస్తారు. 

బిగ్ బాస్ సీజన్ కి ఎంపికైన నోయల్ ప్రవర్తన ఇలానే సాగింది. నటుడు, సింగర్ అయిన నోయల్ హౌస్ లో తన ప్రత్యేకత చాటుకుంటాడని అందరూ అనుకున్నారు. కానీ దాని భిన్నంగా నోయల్ బిహేవియర్ నడిచింది. ఓ బుద్ధుడిలా హౌస్ లో ప్రవర్తించాడు. దాదాపు 8వారాలు హౌస్ లో ఉన్న నోయల్ ఏ ఒక్కరిపై కోప్పడ్డ సంధర్భం లేదు. అందరితో మంచిగా ఉండే నోయల్, నామినేషన్స్ విషయంలో కూడా చిన్న చిన్న కారణాలు చెప్పి, తాను నామినేట్ చేసిన వారికి కోసం రాకుండా జాగ్రత్త పడేవాడు. అందుకే నోయల్ ఎలిమినేషన్ చాలా తక్కువ సార్లు నామినేట్ అయ్యారు. 

ఐతే బిగ్ బాస్ ప్రేక్షకుల సింపథీ, హౌస్ మేట్స్ సపోర్ట్ కోసం నోయల్ కేవలం నటించాడని నిన్నటి ఎపిసోడ్ తో అర్థం అయ్యింది. అందరి గురించి పాజిటివ్ గా చెప్పిన నోయల్ అవినాష్, అమ్మ రాజశేఖర్ లను ఒంటి కాలిపై నిలబెట్టి వాళ్లపై సీరియస్ అలిగేషన్స్ చేశారు. తాను నడవలేక ఇబ్బంది పడుతుంటే దానిని అవినాష్, అమ్మ రాజశేఖర్ ఇమిటేట్ చేస్తూ...ఎగతాళి చేశారని సీరియస్ అయ్యాడు. 

అవినాష్, అమ్మ రాజశేఖర్ చిల్లర కామెడీ చేస్తున్నారని కోప్పడ్డాడు. నోయల్ కోపంలో అర్థం ఉంది అనుకున్నా..అది ఆయన హౌస్ లో ఉన్నప్పుడే చెప్పాలి. వాళ్ళిద్దరిపై అలిగేషన్స్ చేయాలి. కానీ హౌస్ నుండి బయటికి వెళ్ళిపోతూ చెప్పడం అనేది విమర్శకు దారితీస్తుంది. మంచివాడు ముసుగులో అక్కడ తన ఎమోషన్స్ కంట్రోల్ చేసుకున్న నోయల్ వేదికపై వీరిద్దరినీ బ్యాడ్ చేసే ప్రయత్నం చేశాడు. ఎప్పుడూ అమ్మ రాజశేఖర్ తో ఉంటూ తన జోక్ లు ఎంజాయ్ చేసినట్లు నటించిన నోయల్, అమ్మ రాజశేఖర్ ని జోకర్ అన్నాడు. హౌస్ లో ప్రశాంతంగా కనిపించిన నోయల్...అవినాష్, అమ్మ రాజశేఖర్ పై ఇంత ద్వేషం పెంచుకున్నాడా అని అనిపిస్తుంది.