బాలీవుడ్ స్టార్ హీరోయిన్ కత్రినా ఎన్ని ప్రేమ వ్యవహారాలు నడిపించిందో అందరికీ తెలిసిందే. అలాంటిది ఆమె తనను పదేళ్లలో ఎవరూ డేటింగ్ కి పిలవలేదనే స్టేట్మెంట్ ఇచ్చి కామెడీ చేస్తోంది.

అసలు విషయంలోకి వస్తే.. కత్రినా హీరోయిన్ గా నటించిన 'జీరో' సినిమా నిన్న ప్రేక్షకుల ముందుకు వచ్చింది. ఈ సినిమా ప్రమోషన్స్ సమయంలో కత్రినా.. గత పదేళ్లలో తనను ఎవరూ డేట్ కి పిలవలేదని చెప్పుకొచ్చింది.

కత్రినా ఇలాంటి కామెంట్స్ చేయడంతో వెంటనే షారుఖ్ నేను తనను డేట్ కి తీసుకెళ్తా అంటూ సరదాగా అన్నారు. అయితే కత్రినా ఇలాంటి మాటలు చెప్పి కామెడీ చేస్తోందని మీడియా వర్గాలు అంటున్నాయి. కెరీర్ ఆరంభంలో సల్మాన్ ఖాన్ తో ప్రేమాయణం నడిపించిన ఆమె ఆ తరువాత రణబీర్ కపూర్ తో సహజీవనం చేసింది.

ఇద్దరూ కలిసి ఒక ఇంట్లోనే ఉండేవారు. రణబీర్ తో కూడా బ్రేకప్ కావడంతో కొద్దిరోజులు ముఖేష్ అంబానీ కొడుకుతో సన్నిహితంగా కనిపించేది. బాలీవుడ్ ఇలా ఎఫైర్లు సాగించిన ఈ బ్యూటీని ఎవరూ డేట్ కి మాత్రం పిలవలేదట. ఏంటో ఈ కామెడీ !