పవర్ స్టార్ పవన్ కళ్యాణ్, గబ్బర్ సింగ్ డైరెక్టర్ హరీష్ శంకర్ కాంబినేషన్ మరోసారి తెరకెక్కాల్సిన చిత్రం 'భవదీయుడు భగత్ సింగ్'. చాలా కాలంగా ఈ చిత్ర ప్రీ ప్రొడక్షన్ స్టేజిలోనే ఉంది.
పవర్ స్టార్ పవన్ కళ్యాణ్, గబ్బర్ సింగ్ డైరెక్టర్ హరీష్ శంకర్ కాంబినేషన్ మరోసారి తెరకెక్కాల్సిన చిత్రం 'భవదీయుడు భగత్ సింగ్'. చాలా కాలంగా ఈ చిత్ర ప్రీ ప్రొడక్షన్ స్టేజిలోనే ఉంది. షూటింగ్ కి వెళ్లడం లేదు. ఈ చిత్రం ఎప్పుడు మొదలవుతుందనేది క్లారిటీ లేదు.
పవన్ కళ్యాణ్ రాజకీయ వ్యవహారాలు, ఇతర చిత్రాలకు కమిట్ కావడం వల్ల భవదీయుడు భగత్ సింగ్ కి డేట్స్ అడ్జెస్ట్ చేయలేకపోతున్నారని అంటున్నారు. అందుకే చాలా రోజుల క్రితమే సెట్స్ పైకి వెళ్లాల్సిన ఈ చిత్రం ఎక్కడ వేసిన గొంగళి అక్కడే అన్నట్లుగా ఉంది.
దర్శకుడు హరీష్ శంకర్ మాత్రం ఆలస్యం అయినా ఈ చిత్రం తప్పకుండా ఉంటుంది అని అంటున్నారు. ప్రస్తుతం పవన్ కళ్యాణ్ హరిహర వీరమల్లు చిత్రంలో నటిస్తున్నారు. నిన్న పవన్ బర్త్ డే పురస్కరించుకుని అదిరిపోయే టీజర్ రిలీజ్ చేశారు.
భవదీయుడు భగత్ సింగ్ నుంచి చిన్న అప్డేట్ అయినా వస్తుంది అని ఫాన్స్ భావించి చివరకి నిరాశ చెందారు. దీనితో ఈ చిత్రం ఇప్పట్లో లేనట్లే అని క్లారిటీ వచ్చేసింది. హరిహర వీరమల్లుతో పాటు వినోదయ సిత్తం రీమేక్ లో పవన్ నటించాల్సి ఉంది. త్వరలో పవన్ పొలిటికల్ టూర్ కూడా ప్రారంభం కానుంది. ఈ తరుణంలో భవదీయుడు భగత్ సింగ్ మూవీ ప్రారంభం కావడం అసాధ్యం అని అంటున్నారు. మైత్రి మూవీ మేకర్స్ సంస్థ ఈ చిత్రాన్ని నిర్మించాల్సి ఉంది. చాలా రోజుల క్రితమే మైత్రి నిర్మాతలు పవన్ కి అడ్వాన్స్ ఇచ్చారట.
