గతంలో వేణు శ్రీరామ్ , దిల్ రాజు తో ప్రకటించిన ఐకాన్ సినిమా, అలాగే కొరటాల తో అనౌన్స్ చేసిన సినిమా, లింగుస్వామితో ప్రకటించిన సినిమా.లు ఎటు వెళ్లిపోయాయి అంటూ ప్రశ్నించింది.
గత మూడేళ్లుగా పుష్ప పనిలోనే ఉన్న ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ ఇప్పుడు స్పీడు పెంచాలని డిసైడ్ అయ్యారు. అందులో భాగంగా కొత్త చిత్రం ఎనౌన్స్ చేసారు. తెలుగులో 'అర్జున్ రెడ్డి', హిందీలో 'కబీర్ సింగ్'... తో రెండు సార్లు భారీ విజయాలు అందుకుని సెన్సేషన్ క్రియేట్ చేసిన సందీప్ రెడ్డి వంగా దర్శకత్వంలో ఆయన సినిమా చేయనున్నారు. ఈ మేరకు అఫీషియల్ ప్రకటన వచ్చింది. సందీప్ రెడ్డి వంగా, భూషణ్ కుమార్..కలిసిన ఫొటోతో ఈ ఎనౌన్సమెంట్ వచ్చింది.
2025లో ఈ సినిమా మొదలుపెడతారని చెప్తున్నారు. ఈ నేఫద్యంలో ఫ్యాన్స్ పండగ చేసుకున్నారు. కానీ ఓ వర్గం మీడియా మాత్రం .. ఈ సినిమాకి ఇప్పటిదాకా కథ లేదు. చివరకు స్టోరీ లైన్ కూడా చెప్పలేదు. కేవలం కాంబో సెట్ చేసుకుని ప్రకటన ఇచ్చారంతే అని న్యూస్ ఇచ్చింది. అంతేకాదు ఇలాంటి కొత్త కాంబినేషన్ లు ప్రకటించడం బన్నీకి కొత్త కాదు అని రాసుకొచ్చింది. గతంలో వేణు శ్రీరామ్ , దిల్ రాజు తో ప్రకటించిన ఐకాన్ సినిమా, అలాగే కొరటాల తో అనౌన్స్ చేసిన సినిమా, లింగుస్వామితో ప్రకటించిన సినిమా.లు ఎటు వెళ్లిపోయాయి అంటూ ప్రశ్నించింది. ఈ సినిమా కూడా ఎప్పుడు సెట్స్ పైకి వెళుతుందో తెలియని పరిస్దితిలో ఓప్రకటన ఇచ్చారని తేల్చింది.
ప్రస్తుతం సందీప్ వంగా చేస్తున్న యానిమల్, స్పిరిట్ సినిమాలు విజయాలు సాధిస్తే.. ఈ కాంబినేషన్ లైవ్ లో వుంటుందని అంటున్నారు. ఇది చాలా మందిని ఆలోచనలో పడేస్తోంది.
డైరెక్టర్ సందీప్ వంగా ఇప్పుడు రణ్‌భీర్ కపూర్‌తో యానిమల్ అనే సినిమా చేస్తోన్న సంగతి తెలిసిందే. ఇన్‌టెన్స్ మూవీలను తెరకెక్కించటంలో సందీప్ వంగా తనకంటూ ఓ స్టైల్ క్రియేట్ చేసుకుంటున్నారు. ఈ నేపధ్యంలో బన్నీని ఎలా చూపించనున్నారనేది సినీ ప్రేమికుల్లో ఆసక్తిని పెంచుతోంది.
పుష్ప చిత్రంతో పాన్ ఇండియా రేంజ్‌లో బ్లాక్ బస్టర్ సాధించిన అల్లు అర్జున్ ఇప్పుడు పుష్ప 2 సినిమా షూటింగ్‌లో బిజీగా ఉన్నారు. పుష్ప ది రూల్ చిత్రాన్ని వచ్చే ఏడాది సంక్రాంతికి విడుదల చేస్తారనే వార్తలు వినవస్తున్నాయి. ప్రస్తుతం సుకుమార్ (Sukumar) దర్శకత్వంలో ‘పుష్ప: ది రైజ్’ (Pushpa The Rise)కి సీక్వెల్‌గా తెరకెక్కుతోన్న ‘పుష్ప: ది రూల్’ (Pushpa The Rule) చిత్రీకరణలో బన్నీ బిజీబిజీగా ఉన్నారు. ఇందులో ఎర్రచందనం స్మగ్లర్ అయిన పుష్పరాజ్ పాత్రను ఆయన పోషించారు.
