హాట్ బెడ్ రూమ్ సీన్స్ ఉన్నాయి. లిప్ టు లిప్ కిస్ సీన్స్ ఉన్నాయి. తెలుగులోనూ  సమంత ఇవన్నీ చేస్తోందని ప్రచారం జరుగుతోంది. 


హాలీవుడ్ లో సిటాడెల్ సిరీస్ ప్రియాంక చోప్రా, రిచర్డ్ మాడెన్ జంటగా రూసో బ్రదర్స్ దర్శకత్వంలో తెరకెక్కిన సంగతి తెలిసిందే. ఈ సిరీస్ ఏప్రిల్ 28 నుంచి అమెజాన్ లో స్ట్రీమింగ్ అవుతోంది. ఇక ఇదే సిరీస్ కు ఇండియన్ వర్షన్ కూడా నిర్మిస్తున్నారు. ఇందులో వరుణ్ ధావన్, సమంత జంటగా నటిస్తుండగా రాజ్ & డీకే దర్శకత్వం వహిస్తున్నారు. ముఖ్యంగా స్టార్‌ హీరోయిన్‌ సమంత (Samantha) ‘సిటడెల్‌’ (Citadel) వెబ్‌సిరీస్‌లో నటిస్తోండటంతో తెలుగులో క్రేజ్ క్రియేట్ అయ్యింది. స్పై యాక్షన్‌ థ్రిల్లర్‌గా రానున్న ఈ సిరీస్‌ కోసం సామ్‌ చాలా కసరత్తులే చేస్తోంది. అయితే ప్రియాంక (Priyanka), రిచర్డ్‌ మ్యాడెన్‌ నటించిన ఇదే హాలీవుడ్‌ సిరీస్‌ ఇప్పటికే చాలా మంది చూసారు. అందులో హాట్ బెడ్ రూమ్ సీన్స్ ఉన్నాయి. లిప్ టు లిప్ కిస్ సీన్స్ ఉన్నాయి. తెలుగులోనూ సమంత ఇవన్నీ చేస్తోందని ప్రచారం జరుగుతోంది. దాంతో బెడ్ రూమ్ సీన్స్ ని సమంత ఎలా ఒప్పుకుని చేసిందని ఆశ్చర్యపోతన్నారు. 

View post on Instagram

సమంత డేరింగ్ ఉన్న ఆర్టిస్ట్ కాబట్టి... ఎలాంటి పాత్రలు అయినా చేస్తుంది. పుష్ప ఐటెం సాంగ్ లో కూడా హాట్ గా దుమ్ము రేపింది. కాబట్టి ఆమె కథ ప్రకారం బెడ్ రూమ్ సీన్లలో కూడా ఈస్తటిక్ గా తీస్తే ఒప్పుకుని ఉండవచ్చు అని కొందరు సర్ది చెప్పుకుంటున్నారు. ఈ నేపధ్యంలో ఇదే విషయమై సమంత టీమ్ ..క్లారిటీ ఇచ్చింది. వెబ్ సీరిస్ లో అలాంటి బెడ్ రూమ్ సీన్స్ కు చోటు లేదని తేల్చి చెప్పారు. ఇది కొందరు ఆమె అభిమానులకు నిరాశ కలిగించే విషయమే. 

ప్రియాంక (Priyanka), రిచర్డ్‌ మ్యాడెన్‌ నటించిన ఇదే హాలీవుడ్‌ సిరీస్‌ అమెజాన్‌ ప్రైమ్‌లో ఎపిసోడ్‌ల వారీగా స్ట్రీమింగ్‌ అవుతోంది. దీంతో చాలా మంది ఇదే వెబ్‌సిరీస్‌ను సమంత తీయడం ఎందుకని ప్రశ్నిస్తున్నారు. ‘ఇప్పటికే ప్రియాంక చోప్రా నటించిన సిటాడెల్‌ తెలుగులోనూ విడుదలైంది. అందరూ చూశారు కదా.. మళ్లీ మీరు దాన్ని రీమేక్‌ చేయడం ఎందుకు?’ అని ఓ నెటిజన్‌ అడిగిన ప్రశ్నకు సమాధానం ఇచ్చిన సామ్‌ ఇది రీమేక్‌ కాదని చెప్పింది. 

దీనికి మరో యూజర్‌ కామెంట్‌ చేస్తూ.. ‘సిటాడెల్‌’ అన్ని దేశ భాషల్లోనూ తెరకెక్కుతోంది. ఇండియన్‌ వెర్షన్‌లో సమంత, వరుణ్‌ ధావన్‌ నటిస్తున్నారు. ప్రాంతానికి తగినట్లుగా సిరీస్‌లో మార్పులు చేస్తున్నారు’ అని రాశారు. ఇక ఈ కామెంట్‌ను ఆమె లైక్‌ చేసింది. 

ఇక సమంత నటించిన శాకుంతలం సినిమా రిలీజవ్వగా బాక్సాఫీస్ దగ్గర పరాజయం పాలైంది. తాజాగా ‘ఖుషి’తో (Khushi) మరోసారి సినీప్రియులను పలకరించనుంది. శివ నిర్వాణ దర్శకత్వంలో రూపొందుతోన్న ఈ చిత్రంలో సామ్‌తో పాటు విజయ్‌ దేవరకొండ ప్రధాన పాత్రలో నటిస్తున్నారు. ఇప్పటికే 70 శాతం షూటింగ్‌ పూర్తయింది. మిగతా భాగాన్ని శరవేగంగా పూర్తిచేస్తున్నారు.