'భగవంత్ కేసరి’ఆ సీన్స్ ఉండవా, వార్తల్లో నిజమెంత ?
అనిల్ రావిపూడి (Anil Ravipudi) దర్శకత్వం వహించిన ఈ సినిమాపై ప్రేక్షకుల్లో భారీ అంచనాలు ఉన్నాయి. దసరా పండుగ సందర్భంగా అక్టోబర్ 19వ తేదీన ‘భగవంత్ కేసరి’ ప్రేక్షకుల ముందుకు రానుంది

బాలయ్య 'భగవంత్ కేసరి’గా దసరా బరిలో దుమ్ములేపేందుకు సిద్ధమవుతున్న సంగతి తెలిసిందే. ఈ సినిమాపై భాక్సాఫీస్ దగ్గర భీబత్సమైన అంచనాలు ఉన్నాయి. అనిల్ రావిపూడి తెరకెక్కించ్చిన ఈ చిత్రం ట్రైలర్ ఇప్పటికే రిలీజ్ అయ్యి వైరల్ అవ్వుతోంది. సోషల్ మీడియాలో ఎక్కడ చూసినా ఈ సినిమా గురించే డిస్కషన్స్ జరుగుతున్నాయి. సాహు గారపాటి, హరీష్ పెద్ది సంయుక్తంగా నిర్మిస్తున్నారు. కాజల్ హీరోయిన్. అర్జున్ రాంపాల్, శ్రీలీల కీలక పాత్రలు పోషిస్తున్నారు. ‘భగవంత్ కేసరి ఆయుధ పూజతో గీ సారి దసరా జోర్దారుంటది’అంటున్న సమయంలో ఈ సినిమాకు చెందిన ఓ వార్త మీడియాలో హల్ చల్ చేస్తోంది.
అదేమిటంటే ...ఈ సినిమాలో కాజల్, బాలయ్య మధ్య రొమాంటిక్ ట్రాక్ ఏమీ లేదంటున్నారు. బాలయ్య గత చిత్రాలు వీరసింహా రెడ్డి, అఖండలలో రొమాంటిక్ ట్రాక్ లకు రెస్పాన్స్ రాకపోవటంతో అనీల్ రావిపూడి ఈ డెసిషన్ తీసుకున్నాడంటున్నారు. కాజల్ కీ రోల్ లో ఉన్నా మహా అయితే బాలయ్య ని ఇష్టపడి ప్రపోజ్ చేసే పాత్ర అయ్యింటుంది తప్పించి రొమాన్స్ చేసే సీన్స్ అయితే ఉండవంటున్నారు. ఈ టాక్ నిజమే అనిపించేలా ట్రైలర్ లో ఎక్కడా రొమాంటిక్ గ్లింప్స్ ని కట్ చెయ్యలేదు. ఒక్క డైలాగు కూడా లేదు. దాంతో చాలా మంది నిజమే అంటున్నారు. అయితే సినిమా రిలీజ్ అయ్యితే కానీ ఈ వార్తలో నిజమెంత అనేది తెలియదు.
ట్రైలర్‌లో నందమూరి బాలకృష్ణను కొత్త అవతార్‌లో చూపించే ప్రయత్నం చేశారు. ముఖ్యంగా తెలంగాణ మాండలికంలో బాలయ్య చెప్పిన డైలాగులు ఆకట్టుకున్నాయి. ఆయన రొటీన్ డైలాగ్ డెలివరీకి భిన్నంగా ఉండటం కొత్తగా అనిపిస్తుంది. కానీ బాలయ్య మార్కు యాక్షన్ సన్నివేశాలు మాత్రం మిస్ కానివ్వలేదు. థమన్ (SS Thaman) అందించిన రీ-రికార్డింగ్ ట్రైలర్‌ను మరో స్థాయికి తీసుకువెళ్లిందనేది నిజం. ఈ సినిమాలో గిరిజన హక్కుల కోసం పోరాటం చేసే సామాజిక కార్యకర్తగా నందమూరి బాలకృష్ణ కనిపించనున్నారని తెలుస్తోంది. ఆయన పాత్ర కూడా గిరిజనులలో ఒకరిగా ఉంటుందని సమాచారం. సమాజంలో స్త్రీలు ఎదుర్కొంటున్న సమస్యలను సైతం దర్శకుడు అనిల్ రావిపూడి ‘భగవంత్ కేసరి’ సినిమాలో ప్రస్తావించారని తెలిసింది.
ట్రేడ్ వర్గాల నుంచి అందుతున్న సమాచారం మేరకు 'భగవంత్ కేసరి' కి అదిరిపోయే బిజినెస్ జరుగుతోంది. థియేట్రికల్ డిస్ట్రిబ్యూషన్ రైట్స్ ద్వారా 'భగవంత్ కేసరి'కి వచ్చిన రూ. 60 కోట్లు ప్రక్కన పెడితే... ఓటీటీ / డిజిటల్ స్ట్రీమింగ్ రైట్స్ ద్వారా రూ. 36 కోట్లు వచ్చినట్లు సమాచారం. అమెజాన్ ప్రైమ్ వీడియో సంస్థ ఓటీటీ హక్కులను సొంతం చేసుకుందని టాక్. విడుదలకు ముందు నిర్మాతలకు దాదాపుగా 100 కోట్లు వచ్చాయి.
'భగవంత్ కేసరి'కి బ్రేక్ ఈవెన్ టార్గెట్ రూ. 62 కోట్లు. దసరా బరిలో సినిమా విడుదల కనుక సినిమా ఓ మాదిరిగా ఉన్నా దుమ్ము రేపుతుంది. ఇక సూపర్ గా ఉంటే చెప్పక్కర్లేదు. దసరా అక్టోబర్ 19 గురువారం వచ్చింది. అప్పటి నుంచి 24వ తేదీ పండగ వరకు సెలవులు ఉంటాయి కనుక మంచి కలెక్షన్స్ వచ్చే అవకాశం ఉంది.