పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ టీ ఛానెళ్ల పై బ్యాన్ ప్రకటించిన విషయం తెలిసిందే. టీవీ9, టీవి5 ఛానళ్లను చూడొద్దని ఫ్యాన్స్ కి పిలుపునిచ్చిన పవన్ కళ్యాణ్. ఫ్యాన్స్ ఏదో చేసేస్తామని ఇక చానళ్లని చూడమని బాగానే రెచ్చిపోయారు. కొంతమంది ఫ్యాన్స్ ఏకంగా ఇళ్లలో కేబుల్స్ కూడా పీకించుకున్నారు. పవన్ అతని ఫ్యాన్స్ ఎంత హాంగామా చేసిన లాభం లేకపోయింది. మా దేవుడు చెప్తే ఏదైన చేసేస్తామన్న ఫ్యాన్స్ ఏమీ చేయలేకపోయారు. పవన్ పిలుపునిచ్చిన తర్వాత ఏ ఛానెల్స్ అయితే చూడొద్దన్నాడో ఆ ఛానళ్లకు అద్భుతమైన రేటింగ్స్ వచ్చాయి. కేవలం ఒక హీరో చెప్తే టీవి చూడటం మానేసేంత అమాయకులు లేరని బయట పబ్లిక్ ఎద్దేవ చేస్తున్నారు.