Asianet News TeluguAsianet News Telugu

#RRR: `ఆర్‌ఆర్‌ఆర్‌`కి బిగ్‌ షాక్‌.. నో ఆస్కార్‌ ఎంట్రీ.. గుజరాతీ సినిమా ఎంపిక..

ఆస్కార్‌ అవార్డులకు సంబంధించి `ఆర్‌ఆర్‌ఆర్‌`కి పెద్ద షాక్‌ తగిలింది. కనీసం ఈ చిత్రం ఇండియా నుంచి నామినేషన్‌కి కూడా ఎంపిక కాకపోవడం విచారకరం. 

no oscar entry for rrr and gujarati film last film show selected big shock to south film lovers
Author
First Published Sep 20, 2022, 7:24 PM IST

`ఆర్‌ఆర్‌ఆర్‌` సినిమాకి ఈ సారి ఆస్కార్‌ అవార్డుల పంట పండుతుందని, కనీసం రెండుమూడైనా అవార్డులు ఖాయమని అంతా అనుకున్నారు. దీనిపై గత కొన్ని రోజులుగా సోషల్‌ మీడియాలో పెద్ద డిస్కషన్‌ జరిగింది. హాలీవుడ్‌ మేకర్స్ సైతం `ఆర్‌ఆర్‌ఆర్‌`పై ప్రశంసలు కురిపించారు. ఎన్టీఆర్‌, రామ్‌చరణ్‌కి బెస్ట్ యాక్టర్‌ అవార్డు పక్కా అన్నారు. ఇతర విభాగాల్లోనూ అవార్డులు దక్కే ఛాన్స్ ఉందంటూ అంతా ఊదరగొట్టారు. హైప్‌ పెంచారు. కానీ తీరా `ఆర్‌ఆర్‌ఆర్‌`కి పెద్ద షాక్‌ తగిలింది. కనీసం నామినేషన్‌కి కూడా నోచుకోలేకపోయింది. 

ఇండియా నుంచి ఆస్కార్ కి పంపించే సినిమాల ఎంపికలో `ఆర్‌ఆర్‌ఆర్‌`కి మొండిచేయే దక్కింది. ఈ చిత్రాన్ని నామినేషన్‌కి పంపేందుకు ఎంపిక కాకపోవడం గమనార్హం. అయితే గుజరాతీ చిత్రం `లాస్ట్ ఫిల్మ్ షో` ఆస్కార్‌ నామినేషన్‌కి ఎంపిక కావడం విశేషం. ఇంటర్నేషన్‌ ఫిచర్‌ ఫిల్మ్ కేటగిరిలో ఈ చిత్రాన్ని నామినేట్‌ చేసేందుకు ఇండియా జ్యూరీ దీన్ని ఎంపిక చేసింది. అద్భుతమైన కళాఖండంగా భావించిన `ఆర్‌ఆర్‌ఆర్‌` మాత్రం ఆస్కార్‌ బరిలో లేకపోవడం విచారకరం. `ఆర్‌ఆర్‌ఆర్‌` అభిమానులను ఇది తీవ్ర నిరాశ పరిచే అంశం. 

ఇటీవల తరచూ గుజరాతీ సినిమాలే ఆస్కార్‌ నామినేషన్‌కి ఎంపిక కావడం విశేషం. ఇప్పుడు `లాస్ట్ ఫిల్మ్ షో` సైతం ఆస్కార్‌ నామినేషన్‌ కోసం వెళ్లడం పట్ల పలు అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ప్రభుత్వ పెద్దలు గుజరాతీకి చెందిన వారుండటం వల్లే ఇది జరుగుతుందా? అనే అనుమానాలు వ్యక్తమవుతున్నారు. మరి ఇందులో నిజమెంతా అనేది తెలియాల్సి ఉంది. ఇక `లాస్ట్ ఫిల్మ్ షో` గురించి చూస్తే, థియేటర్లో పనిచేసే వ్యక్తి కుమారుడు.. సినిమా ప్రొజెక్షన్‌ అనే మ్యాజిక్కి ఇంప్రెస్‌ అయి తాను సొంతంగా ఆ ప్రొజెక్టర్‌ తయారు చేసేందుకు, సినిమా చేసేందుకు పడే తపన నేపథ్యంలో సాగే చిత్రమిది. 

సినిమా ప్రొజెక్షన్‌ వెనకాల  ఉన్న కాంతి, నీడ, సైన్స్, మ్యాజిక్‌ని అర్థం చేసుకునే తీరు నేపథ్యంలో సాగే ఈ చిత్రం ఇప్పుడు ఆస్కార్‌ కి పోటీ పడబోతుండటం విశేషం. దీనికి పాన్‌ నలిన్‌ దర్శకత్వం వహించగా, భవిన్‌ రాబరి, భవేష్‌ శ్రిమలి, రిచా మీనా, దీపెన్‌ రావల్‌, పరేష్‌ మెహతా, వికాస్‌ బాటా, రాహుల్‌కొలి ప్రధాన పాత్రల్లో నటించారు.ఇది గతేడాది విడుదలైంది.

Follow Us:
Download App:
  • android
  • ios