తెలుగులో 'RX100' చిత్రంతో హీరోయిన్ గా పరిచయమైన నటి పాయల్ రాజ్ పుత్ తొలి సినిమాతోనే సక్సెస్ అందుకుంది. సినిమాలో ఆమె నటనకి, అందాల ఆరబోతకి యూత్ ఫిదా అయిపోయింది. సోషల్ మీడియాలో కూడా ఆమెకి ఫాలోయింగ్ పెరిగిపోయింది.

ఎప్పటికప్పుడు తన ఫోటోలను ట్విట్టర్ లో షేర్ చేస్తూ అభిమానులను ఆకట్టుకుంటోంది. తాజాగా ఈ బ్యూటీ తన ఫోటోని షేర్ చేసి 'ఛాన్స్ ఇవ్వనంత వరకు ఎవరూ హర్ట్ చేయరు' అని రాసింది. ఇది చూసిన నెటిజన్లు ఫోటోతో పాటు క్యాప్షన్ కూడా అదిరిందంటూ కామెంట్స్ పెడుతున్నారు.

ప్రస్తుతం ఈ బ్యూటీ షోరూం ఓపెనింగ్స్ తో బిజీగా గడుపుతోంది. త్వరలోనే రవితేజ సరసన ఓ సినిమాలో హీరోయిన్ గా కనిపించనుంది. అలానే సి. కళ్యాణ్ నిర్మాణంలో ఓ సినిమాకి సైన్ చేసింది.