Asianet News TeluguAsianet News Telugu

బజ్‌ లేదు, బిజినెస్ కాలేదు.. సుధీర్‌ బాబు సినిమాకి ఇలాంటి పరిస్థితేంటి?

సుధీర్‌బాబు నటించిన `మామా మశ్చీంద్ర` సినిమాని సడెన్‌గా ట్రాక్‌లోకి తీసుకొచ్చారు. గత వారం వరకు ఈ సినిమా  రిలీజ్‌ పోటీలోనే లేదు. సడెన్‌గా డేట్‌ దొరికిందని రిలీజ్‌ డేట్‌ ని ప్రకటించారు. 

no buzz no business for hero sudheer babu moie mama mascheendra ? arj
Author
First Published Oct 4, 2023, 6:55 PM IST

సినిమా రంగంలో వారసత్వం పరిచయం వరకే పని చేస్తుంది. ఆ తర్వాత వారి సొంతం టాలెంట్‌తోనే రాణించగలరు. దానికి తగ్గట్టు కథల ఎంపిక కూడా చాలా ముఖ్యం. అయితే సూపర్ స్టార్‌ కృష్ణ ఫ్యామిలీ బ్యాక్‌ గ్రౌండ్‌తో టాలీవుడ్‌లోకి హీరోగా అడుగుపెట్టాడు సుధీర్‌బాబు. ప్రారంభంలో రెండు మూడు చిత్రాలతో ఆకట్టుకున్నారు. `ఏం మాయ చేసావె` చిత్రంలో సపోర్టింగ్‌ రోల్‌లో మెరిశారు. 

ఆ తర్వాత `ప్రేమ కథా చిత్రమ్‌`తో హిట్‌ అందుకున్నారు. కానీ ఆ తర్వాత ఆయనకు పెద్దగా చెప్పుకోదగ్గ హిట్‌ ఒక్కటి కూడా పడలేదు. కొన్ని యావరేజ్‌, మరికొన్ని డిజాస్టర్‌ చిత్రాలే. ఇటీవల కూడా ఆ ఫెయిల్యూర్‌ కొనసాగుతుంది. చివరగా `హంట్‌` చిత్రంతో ఫ్లాప్ ని మూటగట్టుకున్న ఆయన ఇప్పుడు `మామా మశ్చీంద్ర` చిత్రంతో రాబోతున్నారు. ఈ చిత్రం ఈ శుక్రవారం రిలీజ్‌ కాబోతుంది. 

అయితే ఈ సినిమాని సడెన్‌గా ట్రాక్‌లోకి తీసుకొచ్చారు. గత వారం వరకు ఈ సినిమా అసలు రిలీజ్‌ పోటీలోనే లేదు. సడెన్‌గా డేట్‌ దొరికిందని రిలీజ్‌ డేట్‌ ని ప్రకటించారు. ఒకటి అర ప్రెస్‌మీట్లు, ఈవెంట్లు నిర్వహించినా సినిమాకి బజ్‌ రావడం లేదు. ట్రైలర్‌, టీజర్లు కూడా ఆకట్టుకునేలా లేవు. పైగా ఇందులో సుధీర్‌బాబు మూడు గెటప్పుల్లో కనిపిస్తున్నారు. ఏమాత్రం కన్విన్సింగ్‌గా అనిపించడం లేదు. 

నటుడు హర్షవర్థన్‌ దర్శకత్వం వహించిన ఈ చిత్రంలో మృణాళిని రవి, ఈషా రెబ్బా కథానాయికలుగా నటిస్తున్నారు. సినిమా రిలీజ్‌ కి దగ్గరపడుతున్నా దీనిపై ఎలాంటి చర్చ లేకపోవడం, ఎలాంటి హైప్‌ రాకపోవడం గమనార్హం. అంతేకాదు ఈ చిత్రానికి కనీసం బిజినెస్‌ కూడా కాలేదట. నిర్మాణ సంస్థలు శ్రీ వెంకటేశ్వర సినిమాస్ ఎల్ ఎల్ పి, సృష్టి సెల్యులాయిడ్ దీన్ని సొంతంగా రిలీజ్‌ చేస్తున్నారట. థియేటర్లో రెండు మూడు రోజులు ఆడించి, ఓటీటీకి అమ్ముకోవాలని ప్లాన్‌ చేస్తున్నారు. ఇప్పటి వరకు ఓటీటీ కూడా అమ్ముడు పోలేదని సమాచారం.  ఔట్‌పుట్‌ తేడా రావడంతో వదిలించుకోవాలనుకుంటున్నారట. అందుకే సడెన్‌గా రిలీజ్‌ చేస్తున్నట్టు సమాచారం.

అయితే అంత పెద్ద బ్యాక్‌ గ్రౌండ్‌ ఉండి, కృష్ణ, మహేష్‌బాబు వంటి బ్యాక్‌ పిల్లర్స్ ఉన్న సుధీర్‌బాబు సినిమాకి ఇలాంటి పరిస్థితి ఎదురు కావడం, కనీసం రిలీజ్‌ చేసి సినిమాని వదిలించుకోవాలని నిర్మాతలు చూసే పరిస్థితి రావడం అత్యంత విచాకరం. చాలా బాధాకరం. సుధీర్‌బాబు సినిమాల కంటే కొత్తగా వస్తోన్న `మ్యాడ్‌` చిత్రంపై అలాగే, కిరణ్‌ అబ్బవరం `రూల్స్ రంజన్‌`పై మంచి హైప్‌ ఉండటం విశేషం. దీంతోపాటు సిద్ధార్థ్‌ `చిన్నా`, ముత్తయ్య మురళీ ధరన్‌ బయోపిక్‌ `800`పై కూడా మంచి బజ్‌ ఉండటం విశేషం.  
 

Follow Us:
Download App:
  • android
  • ios