ఎన్టీఆర్ వల్ల కూడా కాలేదు!

no buzz for kalyan ram's na nuvve movie
Highlights

కళ్యాణ్ రామ్ నటించిన 'నా నువ్వే' సినిమా రేపు ప్రేక్షకుల ముందుకు రానుంది

కళ్యాణ్ రామ్ నటించిన 'నా నువ్వే' సినిమా రేపు ప్రేక్షకుల ముందుకు రానుంది. అయితే చాలా రోజులుగా ఈ సినిమాను జనాల్లోకి తీసుకువెళ్లడం కోసం చిత్రబృందం ఎన్నో ప్రయత్నాలు చేసింది. కానీ బిజినెస్ పరంగా ఈ సినిమాకు ఎలాంటి క్రేజ్ రాలేదు.

ఇప్పటివరకు కళ్యాణ్ రామ్ ఇటువంటి సినిమాలలో నటించకపోవడం, మాస్ ఇమేజ్ ఉన్న హీరో సడెన్ గా ట్రాక్ మార్చి లవ్ స్టోరీతో వస్తుండడంతో బయ్యర్లలో సందేహాలు నెలకొన్నాయి. పైగా ఈ మధ్యకాలంలో కళ్యాణ్ కు సరైన హిట్ సినిమా కూడా పడలేదు. దీంతో తన తమ్ముడు ఎన్టీఆర్ ను ప్రీరిలీజ్ ఈవెంట్ కు ఆహ్వానించి సినిమాపై బజ్ క్రియేట్ చేసే ప్రయత్నం చేశాడు.

ఎన్టీఆర్ రావడం వలన సినిమా జనాల్లోకి కాస్త రీచ్ అయిందనే చెప్పాలి. కానీ ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద ఇంపాక్ట్ చూపిస్తుందా? అనేది ప్రశ్నగానే మిగిలిపోయింది. ట్రైలర్, పోస్టర్లను బట్టి ఇదొక క్లాస్ లవ్ స్టోరీ అని తెలుస్తోంది. మల్టీప్లెక్స్ ఆడియన్స్  టార్గెట్ గా ఈ సినిమాను రూపొందించారు. విడుదలకు ముందు అయితే సినిమాపై ఎలాంటి అంచనాలు లేవు పైగా మరుసరి రోజు ఇంద్రగంటి 'సమ్మోహనం' సినిమా కూడా ఉంది. ఈ సినిమాతో పోలిస్తే 'సమ్మోహనం'పై మంచి అంచనాలైతే ఉన్నాయి.  కాబట్టి 'నా నువ్వే' సినిమా  తొలిరోజు పాజిటివ్ టాక్ తెచ్చుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది. మరి కళ్యాణ్ ప్రయోగాన్ని ఆడియన్స్ ఎలా రిసీవ్ చేసుకుంటారో చూడాలి!

loader