రజినీ సినిమాను కొనేవారే లేరా..?

no buyers for rajinikanth kaala in telugu
Highlights

సూపర్ స్టార్ రజినీకాంత్ కు ప్రపంచవ్యాప్తంగా అభిమానులు ఉన్నారు

సూపర్ స్టార్ రజినీకాంత్ కు ప్రపంచవ్యాప్తంగా అభిమానులు ఉన్నారు. ఒక్క తమిళనాడులో మాత్రమే కాకుండా ఆయన సినిమాలను ఇతర భాషల్లో కూడా విడుదల చేస్తుంటారు. ఇక తెలుగులో ఆయన సినిమాలకు మంచి క్రేజ్ ఉంది. ఆయన నటిస్తోన్న 'రోబో 2' సినిమా థియేట్రికల్ రైట్స్ ఏకంగా రూ.80 కోట్లకు అమ్ముడయ్యాయి. దీంతో 'కాలా' సినిమాకు కూడా అదే రేంజ్ లో బిజినెస్ జరుగుతుందని ఆశించారు. అదే నమ్మకంతో ఈ సినిమా తెలుగు హక్కులకు భారీ రేట్ చెబుతున్నారు తమిళ నిర్మాతలు. రూ.40 కోట్లు చెల్లించి హక్కులు దక్కించుకోమని చెబుతున్నారట.

ఈ సినిమా టీజర్, పోస్టర్లకు మంచి స్పందన వస్తోంది. కానీ రజిని నటించిన గత చిత్రాలు మిగిల్చిన నష్టాలతో ఇంత భారీ మొత్తం పెట్టి రైట్స్ కొనడానికి నిర్మాతలు ఎవరూ కూడా ముందుకు రావడం లేదు. దీంతో కాస్త రేట్ తగ్గించమని తమిళ నిర్మాతలను కోరుతున్నా వారు మాత్రం అంగీకరించడం లేదట. కనీసం రూ.20 కోట్లకైనా రైట్స్ అమ్ముడవుతాయా..? అనే సందేహాలు కలుగుతున్నాయి. మరి ఈ సినిమాను ఎవరు కొంటారో చూడాలి! 

loader