కళ్యాణ్ రామ్ నటించిన 118 సినిమా శుక్రవారం వరల్డ్ వైడ్ గా రిలీజ్ కానుంది. అసలు సినిమా ఎంతవరకు హిట్టవుతుందో అనే విషయం కన్నా ప్రస్తుతం సినిమాపై ఇద్దరి నటీనటులు పెట్టుకున్న నమ్మకం ఇంట్రెస్టింగ్ గా అనిపిస్తోంది. ఆ ఇద్దరు ఆకాశమంతా ఆశలు పెట్టుకున్నారు. మొదటగా హీరోయిన్ నివేత థామస్  ఈ సినిమాతో హిట్టుకొట్టే తీరాలి. 

జెంటిల్ మెన్ - నిన్ను కోరి వంటి సినిమాలతో మంచి సక్సెస్ అందుకున్న  నివేత ఆ తరువాత జై లవకుశ సినిమాలో తారక్ సరసన నటించిన సంగతి తెలిసిందే. అయితే ఆ సినిమాలో తారక్ యాక్టింగ్ తో డామినేషన్ చేయడంతో ఈ భామకు అనుకున్నంతగా గుర్తింపు రాలేదు. స్టార్ హీరోలతో నటించే ఆఫర్స్ కూడా రావడం లేదు.  

అందుకే కళ్యాణ్ రామ్ నటించిన 118 సినిమా ఎలాగైనా మంచి విజయం సాధించాలని కోరుకుంటోంది. ఇక మెయిన్ గా కళ్యాణ్ రామ్ కూడా ఈ సినిమాతో హిట్టు కొట్టే తీరాలి. గత కొంత కాలంగా హీరోగా వరుస అపజయాలను ఎదుర్కొంటున్న కళ్యాణ్ రామ్ ఈ సినిమాను నమ్మి గట్టిగానే ప్రమోట్ చేస్తున్నాడు. మరి 118 ఏ స్థాయిలో విజయాన్ని అందుకుంటుందో చూడాలి.