తీవ్ర ప్రభావం చూపుతున్న నివర్ తీవ్ర తుపాను ఇప్పటికే తమిళనాడు, పాండిచ్చేరిని వణికిస్తోన్న సంగతి తెలిసిందే.  నేటి సాయంత్రం తర్వాత నివర్ తమిళనాడులోని కారైక్కాల్, మామల్లపురం (మహాబలిపురం) మధ్యన అతి తీవ్ర తుపాను స్థాయిలో తీరం దాటనుంది. నివర్ ప్రభావం ఏపిలో ముఖ్యంగా నెల్లూరు జిల్లాపై ఉంటుందని భావిస్తున్నారు. ముఖ్యంగా పాండిచ్చేరికి 200 కిలోమీటర్ల దూరంలో తుపానుగా బలపడింది. దీంతో అక్కడ భారీ వర్షాలు కురుస్తున్నాయి. తుపాను ఎఫెక్ట్ తో షూటింగ్ నిమిత్తం అక్కడకు వెళ్ళిన హీరో విశ్వక్ సేన్ పాండిచ్చేరిలో ఇరుక్కుపోయాడు.

“పాగల్” అనే తన కొత్త సినిమా షూటింగ్ కోసం కొన్ని రోజుల కిందట పాండిచ్చేరి వెళ్లాడు విశ్వక్ సేన్. కొన్ని రోజుల పాటు షూటింగ్ బాగానే సాగింది. అంతలోనే వర్షాలు, తుపాను మొదలుకావడంతో షూటింగ్ కు బ్రేక్ ఇచ్చారు. అయితే తుపాను వల్ల షూటింగ్ ఆగిపోయినా, విశ్వక్ మాత్రం తను ఉషారు ని కొనసాగిస్తూనే ఉన్నాడు. ఫుల్ ఎంజాయ్ చేస్తున్నాడు. పాండీ వీధుల్లో నడుస్తూ, ఐస్ క్రీమ్ తింటూ ఫొటోలు పోస్ట్ చేస్తున్నాడు. 

 “పాగల్” సినిమాను లక్కీ మీడియా పతాకంపై బెక్కెం వేణుగోపాల్  నిర్మిస్తున్నారు. నరేష్ కుప్పిలి అనే కొత్త డైరెక్టర్ ఈ సినిమాతో పరిచయం అవుతున్నారు. ఇక అప్పుడెప్పుడో అందాల రాక్షసి నుంచి మొన్నవచ్చిన అర్జున్ రెడ్డి వరకు విలక్షణమైన సంగీతం అందించే రధాన్ ఈ సినిమాకు మ్యూజిక్ డైరెక్టర్ పని చేస్తున్నారు.

విశ్వక్ గత సినిమా అయినా “హిట్” కు డైరెక్టర్ ఆఫ్ ఫోటోగ్రఫీ గా వ్యవహరించిన మనికందన్ సర్ ఈ సినిమాకు కూడా పని చేస్తున్నారు. ఎన్నో సూపర్ హిట్ సినిమాలకు ఎడిటర్ గా పనిచేసిన గ్యారీ ఈ సినిమాకు ఎడిటర్. ప్రస్తుతం కరోనా వైరస్ కలకలం రేపుతున్న నేపథ్యంలో ఈ సినిమా షూట్ ని చాలా తక్కువ క్రూతో ప్లాన్ చేసారు.