భారీగా బిగ్‌బాస్ హౌస్‌కు నీరు చేరింది. ఈ పరిస్దితిని చూసి హౌస్ లోని కంటెస్టెంట్లు భయంతో వణికిపోయారు. బిగ్ బాస్ యాజమాన్యం తో తమను వేరే చోటికి తరలించాలని కోరడంతో వారిని ఫైవ్ స్టార్ హోటల్‌కు తరలించారు అని తమిళ మీడియాలో కథనాలు వెలువడుతున్నాయి.
నివర్ తుపాను ప్రభావంతో చెన్నైలో భారీ వర్షాలు కురుస్తున్నాయి. విద్యాసంస్థలకు శనివారం వరకు సెలవు ప్రకటించారు. అంతకుముందు అతి తీవ్ర తుపానుగా కదిలిన నివర్... బుధవారం అర్ధరాత్రి 11.30 నుంచి గురువారం తెల్లవారుజామున రెండు గంటల మధ్య చెన్నై సమీపంలో తీరం దాటాక క్రమంగా బలహీనపడింది. వాయవ్య దిశగా కదిలి కర్ణాటక వైపు వెళ్లింది. తమిళనాడులోని కడలూరు, విళ్లుపురం, రాణిపేట, చెన్నై, చెంగల్‌పట్టు, కాంచీపురం, తిరువళ్లూర్, మయిలాడుదురై, నాగపట్టణం తదితర జిల్లాల్లో భారీ వర్షాలు నమోదయ్యాయి. ఈ నేపధ్యంలో బిగ్‌బాస్ 4 తమిళ షో ఇబ్బందుల్లో పడింది. తుఫాన్ ప్రభావంతో బిగ్‌బాస్ ఇంటిని కూడా వరదలు ముంచెత్తాయి. దాంతో బిగ్‌బాస్ ఇంటిలోకి భారీగా వరద రావడంతో కంటెస్టెంట్లను మరో ప్రాంతానికి తరలించారు.
ఇంటి సభ్యులను వరద ముంపుకు గురికాకుండా జాగ్రత్తలు తీసుకొన్నట్లు తెలుస్తోంది. బిగ్ బాస్ ఇంటి సభ్యులను నగరంలోని ఫైవ్ స్టార్ హోటల్‌కు తరలించినట్టు సమాచారం. చెంబారాబక్కమ్ డ్యామ్ గేట్లు ఎత్తివేయడం ఇందుకు కారణంగా తెలుస్తోంది. దాంతో భారీగా బిగ్‌బాస్ హౌస్‌కు నీరు చేరింది. ఈ పరిస్దితిని చూసి హౌస్ లోని కంటెస్టెంట్లు భయంతో వణికిపోయారు. బిగ్ బాస్ యాజమాన్యం తో తమను వేరే చోటికి తరలించాలని కోరడంతో వారిని ఫైవ్ స్టార్ హోటల్‌కు తరలించారు అని తమిళ మీడియాలో కథనాలు వెలువడుతున్నాయి.
ఇక తుపానులో కొంతభాగం ఇంకా సముద్రంలోనే కేంద్రీకృతమై ఉందని, కర్ణాటకలోని కొన్ని ప్రాంతాల్లో వర్షం కురిసే అవకాశముందని ఐఎండీ ట్విట్టర్‌లో పేర్కొంది. గురువారం రాయపేట ప్రాంతంలో రోడ్డు దాటుతున్న 50 ఏళ్ల వ్యక్తిపై భారీ వృక్షం కూలడంతో అక్కడికక్కడే మృతిచెందాడు. విళ్లుపురంలో గోడకూలి మహిళ మృతి చెందగా, విద్యుదాఘాతంతో మరో వ్యక్తి చనిపోయారు. తిరునిండ్రయూర్‌లో నిలిపి ఉంచిన ఎక్స్‌ప్రెస్ రైలుపై భారీ వృక్షం కూలింది. గురువారం సాయంత్రానికి అత్యధికంగా చెన్నై శివారు తాంబరంలో 31 సెంటీమీటర్లు వర్షపాతం నమోదైంది.
Read Exclusive COVID-19 Coronavirus News updates, from Telangana, India and World at Asianet News Telugu.
వర్చువల్ బోట్ రేసింగ్ గేమ్ ఆడండి మిమ్మల్ని మీరు ఛాలెంజ్ చేసుకోండి ఇప్పుడే ఆడటానికి క్లిక్ చేయండి
Last Updated Nov 27, 2020, 9:25 AM IST