సాధారణంగా హిట్ కాంబినేషన్ లో సినిమా వస్తోందంటే ట్రేడ్ లో క్రేజ్ క్రియేట్ అవుతుంది. ఫ్యాన్స్ లోనూ ఈ సినిమాపై అంచనాలు మొదలవుతాయి. అందుకే హీరోలు తమకు గతంలో హిట్ ఇచ్చిన దర్శకులతో మరో సారి చేయటానికి ఉత్సాహం చూపిస్తారు. అయితే ఆ దర్శకులు ఫ్లాఫ్ లో ఉంటే మాత్రం ప్రక్కన పెట్టేస్తారు. కానీ నితిన్ రివర్స్ లో వెళ్తున్నారు. తన కెరీర్ లో `గుండె జారి గ‌ల్లంత‌య్యిందే` వంటి పెద్ద హిట్ సినిమా ఇచ్చిన దర్శకుడుని పిలిచి మరీ సినిమా ఇచ్చినట్లు సమాచారం.

వాస్తవానికి `గుండె జారి గ‌ల్లంత‌య్యిందే` తర్వాత దర్శకుడు విజయ్ కుమార్ కొండకు మంచి పేరు వచ్చింది. వరస ఆఫర్స్ వచ్చాయి. హీరోలంతా ఈ దర్శకుడుతో చేయాలని ఉత్సాహం చూపించారు. వెంటనే నాగచైతన్య పిలిచి ఆఫర్ ఇచ్చారు. దాంతో  `ఒక లైలా కోసం`అనే సినిమా బయిటకు వచ్చింది. భారీ అంచ‌నాల మధ్య  విడుద‌లైన సినిమా డిజాస్టర్ అయ్యింది.

దాంతో మొదటి సినిమాకు వచ్చిన పేరు మొత్తం పోయింది.  ఆతతర్వాత  విజ‌య్ కు మ‌రో ఆఫర్ రాలేదు. అంతేకాదు అతని కుటుంబంలో వివాదాలు త‌లెత్త‌డంతో కొన్ని ఇబ్బందుల‌కు గుర‌య్యాడు. ఈ నేప‌థ్యంలో కొన్నాళ్ల నుంచి సినిమాల‌కు దూరంగా ఉండటం జరిగింది. చివరకు ఆ స‌మ‌స్య‌ల‌న్ని ఓ కొలిక్కి వ‌చ్చి ఓ స్క్రిప్టు రెడీ చేసారట‌. దీంతో  నితినే పిల్చి మరీ సినిమా ఇచ్చినట్లు తెలుస్తోంది. 

రీసెంట్ గా నితిన్ ని క‌లిసి లవ్ స్టోరీలైన్ వినిపించాడుట‌. స్టోరీ లైన్ న‌చ్చ‌డం…గ‌తంలో హిట్ కూడా ఇచ్చిన ద‌ర్శ‌కుడు కావ‌డంతో చేద్దామ‌ని మాటిచ్చాడుట. త్వరలోనే పట్టాలు ఎక్కే అవకాసం ఉందంటున్నారు. ఛలో డైరక్టర్ తో సినిమా పూర్తయ్యాక ఈ సినిమా ప్రారంభం కానుంది.